Site icon Swatantra Tv

సుప్రీంకోర్టులో వనమాకు ఊరట.. అనర్హత వేటుపై స్టే

స్వతంత్ర వెబ్ డెస్క్:  సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు(Vanama Venkateswara Rao) ఊరట లభించింది. వనమా అనర్హత వేటుపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. జలగం వెంకరావు సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుందో లేదో తెలుస్తామని చెప్పింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

కాగా ఎన్నికల అఫిడవిట్లలో సమాచారం దాయడంతో వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వనమాపై అనర్హత వేసిన హైకోర్టు ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది.

తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నట్లు వెల్లడిచింది.

Exit mobile version