Site icon Swatantra Tv

టీ20 వరల్డ్ కప్‌లో యూఎస్‌ఏ సంచలనం

   టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. పాకిస్థాన్‌పై అమెరికా చరిత్రాక విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రూప్‌ Aలో డల్లాస్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో గెలుపొం దింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయింది. సూపర్‌ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. ఇందులో 7 రన్స్‌ ఎక్స్‌ ట్రాలే. 19 పరుగుల లక్ష్యఛేదనలో పాక్‌ 13 రన్స్‌కు పరిమితమైంది. 160 పరుగుల లక్ష్యఛేదనలో అమెరికా ఓపెనర్‌ స్టీవెన్ టేలర్‌ 12 రన్స్‌ చేసి తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరినా కెప్టెన్ మోనాంక్ పటేల్ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీశ్ కుమార్ బ్యాడింగ్‌లో రాణించారు. పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ అమిర్‌, నసీమ్ షా, హరిస్‌ రవూఫ్‌ తలో వికెట్ పడగొట్టారు.

Exit mobile version