29.7 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

ఈ మాట చెప్పిన హీరోయిన్ ఎవరు?

ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? అవునండీ…అవును…మీరు ఊహించింది నిజమే…మజిలీ సినిమాలో హీరోయిన్ తనే…అంటే కొన్ని సినిమాలు జీవితానికి దగ్గరగా ఉంటాయి. మజిలీ సినిమాలో సమంత-నాగచైతన్య ఆరోజున నిజజీవితంలో కూడా భార్యాభర్తలు…సినిమా కథ పరంగా చూస్తే చైతన్య ఒకమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను మరిచిపోలేక తాగుడుకి బానిస అయిపోతాడు.

ఇప్పుడు వాస్తవంలోకి వస్తే, నాగచైతన్య-సమంత ఇద్దరూ విడిపోయారు. కానీ మజిలీ సినిమాలో ప్రేయసిగా నటించిన దివ్యాంశ కౌశిక్ తో ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు సమాచారం. వారిద్దరి మధ్య ఏదో…ఏదో..సమ్ థింగ్, సమ్ థింగ్ అంటున్నారు. వారిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో దివ్యాంశ…ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వైరల్ గా మారి, నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మరింత వేడి పుట్టిస్తున్నాయి. ఇంతకీ తనేం చెప్పిందంటే…

‘‘నాగ చైతన్య చూడటానికి బాగుంటాడు. ఐ లవ్ నాగచైతన్య, మేం పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. రవితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’లో ఛాన్స్ రావడానికి  చై కారణం అంటూ వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదు. అంటూనే తను ఒక బాంబ్ పేల్చింది. అదేమిటంటే తనతో నాకు క్రష్ ఉంది. అని అసలు విషయం చెప్పేసింది.

అయితే సోషల్ మీడియాలో సమంత అంత హడావుడి చేసినా, ఏనాడు నాగ చైతన్య కిమ్మని అనలేదు. చిన్న సౌండ్ కూడా ఇవ్వలేదు. తన అభిప్రాయం చెప్పలేదు. ఇప్పుడు దివ్యాంశ చెప్పిన విషయంపై కూడా చై స్పందిస్తాడని అనుకోవడం వెర్రి భ్రమే అవుతుందని ఒక నెటిజన్ రాశాడు. ఇక దివ్యాంశ చెప్పింది కదా…‘‘రాసుకున్నవాళ్లకి రాసుకున్నంత మహదేవా’’ అని మరొకరు వ్యాక్యానించారు. తను ‘నో’ చెపింది కదా…అని ఒకరంటే, అందరూ అలాగే చెబుతారని మరొకరు వ్యాక్యానించారు. ఇదండీ నెట్టింట గోల.

Latest Articles

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్