Site icon Swatantra Tv

జగన్ పై దాడి కేసులో ఇద్దరు అరెస్ట్

    సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1గా రాయితో దాడి చేసిన సతీష్, ఏ2గా దుర్గా రావు పై కేసు నమోదైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించా రు పోలీసులు. దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి సతీష్ దాడి చేసినట్లు తెలిసింది. రాయితో దాడి చేసిన తర్వాత సతీష్, దుర్గారావులు తమకు ఇళ్లకు వెళ్లిపోయినట్లు విచారణలో తెలిసింది. అరెస్టు చేసిన వారిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.

 

Exit mobile version