Site icon Swatantra Tv

కేంద్రప్రభుత్వంపై తులసిరెడ్డి ఫైర్

   కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వమని విమర్శించారు. పోటీ పరీక్షలను అవినీతికి, లీకులకు, అక్రమాలకు చోటులేకుండా నిర్వ హించలేని చతకాని ప్రభుత్వమని అన్నారు. పదేళ్లలో దాదాపు 72 సార్లు పరీక్షా పేపర్లు లీక్‌ అయ్యా యని, ఇప్పటికైనా పరీక్షను రద్దు చేసి మళ్లీ పకడ్బందీగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రధాని మౌనం వీడాలని కోరారు. సత్వరమే సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Exit mobile version