స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమల అన్నమయ్య భవనంలో పీఠాధిపతులతో సమావేశమైన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేస్తామని అయన తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై వస్తోన్న ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలను చేసారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై వస్తోన్న ఆరోపణలను ఈ సందర్భంగా పీఠాధిపతులు, స్వామీజీలు ఖండించారు. ఆ నిధులు సద్వినియోగమవుతున్నాయని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పలు ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణను తితిదే చేపట్టిందన్నారు. అనంతరం ఈవో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్‌కు ఆన్‌లైన్ ద్వారా రూ.475.57 కోట్లు, ఆఫ్‌లైన్ ద్వారా రూ.350.82 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అమరావతిలో రూ.150కోట్లతో ఆలయం నిర్మించామని చెప్పారు.