TSPSC పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ పై ఆ సంస్థ చైర్మన్ జనార్ధన్ రెడ్డి స్పందించారు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీస్ పేపర్ లీకైందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. అయితే ఎంతమందికి పేపర్ లీకైందనేది పోలీసుల విచారణలో తేలిందన్నారు. విచారణ తర్వాత న్యాయ సలహా తీసుకుని పరీక్ష రద్దు చేయడమా లేదా అనే నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇఖ AE పరీక్ష రద్దుపై బుధవారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. TSPSC ద్వారా ఇప్పటివరకు 35వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మరో 25వేల ఉద్యోగాలకు నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు.