Site icon Swatantra Tv

టీఎస్ పిఎస్సీ వెబ్ సైట్ హ్యాక్

తెలంగాణ: టీఎస్ పిఎస్సీ వెబ్ సైట్ హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో తెలంగాణలో మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. ఇక మార్చి 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష సైతం వాయిదా వేసినట్టు తెలిపింది. కంప్యూటర్ తమ వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైనట్లు తెలుసుకున్న TSPSC అధికారులు… పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టిఎస్ పిఎస్సీ వెబ్ సైట్ హ్యాకింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. వాయిదా పడిన పరీక్షల వివరాలను మళ్లీ ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు.

Exit mobile version