స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎస్సై సైదులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. ఓ కేసు విచారణలో భాగంగా చల్లా గురవరెడ్డి వ్యక్తిని ఎస్సై సైదులు దారుణంగా కొట్టారు. ఎస్సై సైదులు కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక చల్లా గురవారెడ్డి అనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో గురువారెడ్డి బంధువులు పోలీస్ స్టేషన్ లోకి చొరబడి గందరగోళం సృష్టించారు. గురువారెడ్డిని మెరుగైన చికిత్సకోసం బంధువులు వినుకొండకి తరలించారు.


