Site icon Swatantra Tv

ఏపీలో 12 మంది ఐఏఎస్‌ల బదిలీలు

    ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్, పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్‌, అనకాపల్లి కలెక్టర్‌గా కె.విజయ, కోనసీమ కలెక్టర్‌గా రావిరాల మహేశ్‌ కుమార్, కడప కలెక్టర్‌గా లోతేటి శివశంకర్, పల్నాడు కలెక్టర్‌గా అరుణ్‌బాబు, నెల్లూరు కలెక్టర్‌గా ఆనంద్, తిరుపతి కలెక్టర్‌గా వెంకటేశ్వర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా చామకుర్రి శ్రీధర్, సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా చేతన్, నంద్యాల కలెక్టర్‌గా రాజకుమారి, విశాఖ కలెక్టర్‌గా హరేంద్రప్రసాద్ గా బదిలీ అయ్యారు.

Exit mobile version