Site icon Swatantra Tv

అమెరికాలో న్యూఇయర్‌ వేడుకల్లో విషాదం.. 10 మంది మృతి

అమెరికాలో న్యూఇయర్‌ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. న్యూ ఇయర్‌ వేడుకల్లోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. 30 మంది గాయపడ్డారు.

న్యూ ఇయర్ రోజున న్యూ ఓర్లీన్స్‌లో జనంపైకి కారు దూసుకెళ్లడంతో కనీసం 10 మంది చనిపోయారని, 30 మంది గాయపడ్డారని తెలుస్తోంది. కారు డ్రైవర్‌ జనాలపై కాల్పులు జరిపారని కూడా అంటున్నారు.

ఫ్రెంచ్ క్వార్టర్ అని పిలువబడే నగరంలోని ఒక భాగంలో కెనాల్ అండ్‌ బోర్బన్ స్ట్రీట్ కూడలి వద్ద ప్రజలు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో పికప్ ట్రక్ అధిక వేగంతో వారిపైకి దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. దాడి తర్వాత డ్రైవర్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

వెంటనే పోలీసులు గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Exit mobile version