మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో 7 మృత దేహాలను వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. రేణుక ఎల్లమ్మ కాలనీలో ఓ భవన నిర్మాణంలో సెంట్రింగ్ పని చేస్తున్న కార్మికులుగా తెలుస్తోంది. కార్మికుల ఉన్న షెడ్‌పై రిటైనింగ్ వాల్ కూలి పడడం తో ఈ విషాదం చోటుచేసుకుంది. గోడ కూలిందన్న సమాచారం అందుకున్న అధికారులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మొత్తం ఏడు మృతదేహాలను వెలికితీశారు. మృతుల రామ్ యాదవ్, గీత, హిమాన్షు, తిరుపతిరావు, శంకర్, రాజు, ఖుషిగా గుర్తించారు.
బాచుపల్లిలో విషాదం
