Site icon Swatantra Tv

ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ లోయకు పోటెత్తుతున్న పర్యాటకులు

  2019 ఆగస్టు ఐదో తేదీన నరేంద్ర మోడీ నాయకత్వానగల కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసింది. అలాగే జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీరు, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌ను జనజీవన స్రవంతిలోకి తీసుకురా వడానికి అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్‌లో సామాజిక పరిస్థితులు మారిపోయాయి కాశ్మీర్‌ లోయలో తుపాకుల చప్పుళ్లు వినిపించడం మానేసింది. జమ్మూ కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడం మొదలయింది. ఒక్క మాటలో చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ అభివృద్దిగా దిశగా పయనించడం మొదలైంది. మంచులోయకు మంచి రోజులొచ్చాయి. ఇదంతా ఆర్టికల్ 370 రద్దయిన తరువాత జరిగిన పరిణామాలు.

   సహీ రాస్తా కాశ్మీర్ అభివృద్దిలో ఇదొక కీలక పథకం. కాశ్మీర్‌ను ప్రగతి పథంలో దూసుకెళ్లడానికి ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం సహీ రాస్తా పథకానికి శ్రీకారం చుట్టింది. సహీ రాస్తా పథకం అమలులోకి రాకముందు కాశ్మీర్‌ లోయలో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. కాశ్మీర్ లోయ అంతటా తుపాకుల చప్పుళ్లే వినిపించేవి. ఎప్పుడు చూసినా తూటాలు పేలుతున్న చప్పుళ్లే వినిపించేవి. ఎటుచూసినా అమాయకులైన పర్యాట కులు, ప్రజలు విగతజీవులుగా మారిన దృశ్యాలే కనిపించేవి. గతంలో కశ్మీర్ యువత గతంలో ఉగ్రవాదం పడగ నీడన ఉండేది. చదువుకోవడాలుఉద్యోగాలు చేయడాలు ఇవేమీ కశ్మీర్ యువత అజెండాలో ఉండేవి కావు. కాస్తంత వయస్సు రాగానే, ఏదో ఒక ఉగ్రవాద సంస్థలో చేరడం అమాయకులైన ప్రజలపై ఏదో ఒక కారణంతో విరుచుకుపడటం. ఇదే ఒక తంతులా నడిచేది.

   కాశ్మీర్ యువత ఉగ్రవాదం వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు రూపొందించిన పథకమే,సహీ రాస్తా. కాశ్మీర్ యువతకు సరైన దారి చూపించే పథకం ఇది. ముందుగా టెర్రరిజం వైపు వెళ్లే కుర్రకారును సైన్యాధికారులు గుర్తిస్తారు. ఆ తరువాత సహీ రాస్తాలో భాగంగావారిని మోటివేట్ చేస్తారు. ఉగ్రవాదం వల్ల కలిగే అనర్థాలను విడమరచి చెబుతారు. ఆ తరువాత వారిని , పునరావాస శిబిరాలకు తరలిస్తారు. పునరావాస శిబిరాలకు వెళ్లే యువతలో 87 శాతం మందిలో మార్పు వచ్చిందన్నారు సహీ రాస్తా ప్రాజెక్ట్ నిర్వాహకులు. అంతేకాదు కాశ్మీర్ లో చదువుకున్న యువత కూడా తక్కువే. చాలామంది స్కూల్ ఫైనల్ తోనే చదువులు ఆపేవారు. ఇక కాలేజీ చదువుల వరకు వచ్చే యువతీ యువకులు బాగా తక్కువగా ఉండేవారు. అంతేకాదు అసలు ఏడాదిలో సగం రోజులు కూడా కాలేజీలు నడిచేవి కాదు. ఎప్పుడూ కశ్మీర్ లోయలో ఏదో ఒక అల్లరి. దీంతో కాలేజీలకు సెలవలు ప్రకటించే వారు. చదువు తక్కువ కావడంతో జేఈఈ నీట్ వంటి పరీక్షల్లో కాశ్మీర్ స్టూడెంట్లు ఇతరులతో పోటీ పడలేకపోయేవారు. దీన్నిఅధిగమిం చడానికి సూపర్ – 50 పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది కాశ్మీర్ పాలకవర్గం. ఈ పథకం కింద అన్ని ప్రభుత్వ పాఠశాల్లో పరీక్షలు జరుపుతారు. ఈ పరీక్షల్లో మొదటి 50 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను శ్రీనగర్ లోని ప్రత్యేక కాలేజీకి తరలిస్తారు. అక్కడ వారికి ఉచిత విద్య అందిస్తారు. అంతేకాదు నీట్ జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కూడా ఇక్కడే శిక్షణ ఇస్తారు.

    కాశ్మీర్ అంటే భూతల స్వర్గం. కాశ్మీర్‌ అంటే పర్యాటకానికి మారుపేరు. ఆర్టికల్ 370 అమలులో ఉన్నంత కాలం కాశ్మీర్ లో కాగడా పెట్టి వెతికినా టూరిస్టులు కనిపించేవారు కాదు. అయితే ఆర్టికల్ 370 రద్దు అయిన తరువాత కాశ్మీర్‌లో పరిస్థితులు మారాయి. కాశ్మీర్ లోయకు పర్యాటకులు పోటెత్తడం మొదలైంది. కాశ్మీర్‌ లోయలో ఎటు చూసినా పర్యాటకులే కనిపించడం మొదలైంది. గతంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఎన్నడూ టూరిస్టులు కాశ్మీర్ లోయకు వచ్చేవారు కాదు. రోజుకు సగటున అరవై వేల మంది పర్యాటకులు వచ్చినట్లు లెక్కలు తేల్చి చెప్పాయి. పర్యాటకుల సంఖ్య పెరగడంతో హోటళ్లు రెస్టారెంట్లలో ఆక్యుపెన్సీ రేటు 95 శాతానికి చేరుకుంది. దీంతో గదుల అద్దెలు కూడా పెంచేశారు హోటళ్ళ యజమానులు.

  కాశ్మీర్ కు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకరంగమే. ఉగ్రవాదం కారణంగా గతంలో కశ్మీర్ అందాలు చూడటానికి వచ్చేవారు చాలా తక్కువగా ఉండేవారు. ఆరేడు ఏళ్ల కిందట అయితే హోటళ్లు రెస్టారెంట్లలో ఆక్యుపెన్సీ రేటు 30 శాతం లోపే ఉండేది. కేవలం పర్యాటకం మీద ఆధారపడే కాశ్మీర్‌ లోయలో కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. పర్యాటకరంగం దెబ్బతిన్నప్పుడు ఈ కుటుంబా లకు ఉపాధి ఉండేది కాదు. బతకడానికి నానా ఇబ్బందులు పడేవాళ్లు. ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్‌ లోయకుమంచి రోజులు వచ్చాయన్నారు స్థానికులు. చాలా కాలం తరువాత నాలుగు రాళ్లు సంపాదిస్తున్నామని కాశ్మీర్‌లోయలోని ప్రజలు మురిసిపోయారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ పరిస్థితులు మారిపోయాయి. అంతకుముందు తుపాకుల గర్జనలు వినిపించిన కాశ్మీర్ లోయలో ఇప్పుడు పరిశ్రమలు పురుడు పోసుకుంటున్నాయి. కాశ్మీర్ లో వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్రం ప్రతి ఏడాది, దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. అనేక ప్రాజెక్టుల రూపంలో ఈ సొమ్ము,కాశ్మీర్ ప్రజలకు అందుతోంది.ర్టికల్ 370 రద్దు తరువాత, పరిశ్రమల ఏర్పాటుకు కాశ్మీర్ లోయ తలుపులు బార్లా తెరచింది. కాశ్మీర్‌ లోయలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపడం మొదలైంది. కాశ్మీర్‌ లోయలోని మెజారిటీ ప్రాజెక్టులు… మౌలిక వసతుల కల్పనకు సంబంధించినవే.

    గతంలో, కాశ్మీర్ లోయలో పరిశ్రమలు పెట్టడానికి కాగడా పెట్టి వెతికినా, ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. ఉగ్రవాదం పట్ల భయమే దీనికి కారణం. టెర్రరిస్టులను దాటుకుని పరిశ్రమలను పెట్టాలన్నా ఆలోచన కూడా ఎవరికీ వచ్చేది కాదు. పరిశ్రమల సంగతి తరువాత, ముందు బతికుంటే చాలు అనుకునేవారు పారిశ్రామికవేత్తలు. కాశ్మీర్‌ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడానికి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. కాశ్మీర్‌ లోయ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిచింది. అంతేకాదు ప్రభుత్వం నుంచి రుణాలు, సబ్సిడీలు కాశ్మీరీ ప్రజలకు అందుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులకు అతి తక్కువ ధరకు, భూమి కూడా కేటాయిస్తోంది. దీంతో లోయలో తక్కువ పెట్టుబడితో, పరిశ్రమలు పెట్టడానికి కాశ్మీర్ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతు న్నారు.

  పారిశ్రామికరంగం అభివృద్ధి చెందాలంటే అందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలి. రోడ్డ నిర్మాణం, తాగునీటి సౌకర్యం వంటి వసతులకు పెద్ద పీట వేయాలి. దీంతో కాశ్మీర్‌లోయలో అభివృద్ధిని పరవళ్లు తొక్కించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేసింది. కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది.పథకాలను రూపొందించడమే కాదు. వాటిని సరిగ్గా అమలయ్యేలా చర్యలు కూడా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. మొత్తానికి జమ్మూ కాశ్మీర్‌ను అన్ని రాష్ట్రాలతో పాటు అభివృద్ధి ట్రాక్ మీదకు ఎక్కించడా నికి కేంద్ర ప్రభుత్వ చేయాల్సిందంతా చేసింది.

Exit mobile version