39.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

ఊ అంటావా మామ…ఉఊ అంటావా? అన్నట్టుంది

యండమూరి వీరేంద్రనాథ్ లాంటి ప్రముఖ నవలా రచయిత, టాలీవుడ్ లో జగమెరిగిన పాటల రచయిత చంద్రబోస్ ఇద్దరి మధ్య రగులుకున్న మంట ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు. ఆ సాహిత్యంపై ఒకరు రాసిన పోస్టింగును ఫార్వర్డ్ చేసిన యండమూరి, తర్వాత కనీసం దానిపై స్పందించలేదు. మారు మాట్లాడలేదు. మరి ఆ సంగతేమిటో చూద్దామా…

ఒకరు సీనియరు, మరొకరు జూనియరు…

అది కూడా ఒక సినిమా పాటపై చర్చ, రెండు మెగాస్టార్ కొత్త సినిమాలో పాట, మూడు సంక్రాంతి జోష్… కాలం ఇంత పాజిటివ్ గా, హాయిగా సాగిపోతున్న నదిలా ఉండగా, సడన్ గా ఒక విలన్ వచ్చి  అందులో ఒక రాయి విసిరాడు. ఇప్పుడా నీళ్లన్నీ చెదిరిపోయాయి. తలోదిక్కుకీ వెళ్లిపోతున్నాయి. వాటిని మళ్లీ తోడి, బకెట్ లో పట్టే పనిలో చంద్రబోస్ ఉంటే, ఆ బకెట్ ని తన్నినవాడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నమాట.

ఇంతకీ విషయం ఏమిటంటే…

చంద్రబోస్ రాసిన వాల్తేరు వీరయ్య పాటే ఇంత వివాదానికి కారణం. చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ లా కనిపిస్తున్న ఈ పాటలో రాసిన చరణాల్లో రెండు లైన్లు అర్థవంతంగా లేవని, ఎవరో ఒకరు పోస్ట్ పెడితే, దానిని యండమూరి వీరేంద్రనాథ్ ఫార్వర్డ్ చేశారు. ఎప్పుడైతే యండమూరి అటెన్షన్ వచ్చిందో, ఆ పాటకి జీవం వచ్చింది. అది వైరల్ అయిపోయింది. అంతే కాదు వేటూరితో సాహిత్యం మరణిస్తే, సిరివెన్నెలతో ఆ చిరుదీపం కూడా ఆరిపోయిందనే ఆవేదన అందులో ఉంది.

ఇంతకీ పాట ఏమిటంటే…

‘‘తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడు వీడే

తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడై వీడే…’’

ఈ పదాలు ఇప్పుడు రచ్చరచ్చగా మారినా, మళ్లీ ఒకసారి మన తెలుగు భాషా సంస్ర్కతీ వైభవాన్ని గుర్తు చేసినట్టుగా ఉందని కొందరు వ్యాక్యానిస్తున్నారు. ఇలాంటి చర్చలు అప్పుడప్పుడు జరిగితే మన తెలుగు భాష గొప్పతనం, అందరిలో ఉన్న భాషా ప్రావీణ్య పటిమ అందరికీ తెలుస్తుందని అంటున్నారు.

ఇంతకీ ఆ లేఖలో పాఠకుడి ఆవేదన ఏమిటంటే…

ఒకవైపు తుఫాను వస్తుంటే ఎంత గొప్ప వశిష్ఠుడైతే మాత్రం దాని ముందు కూర్చోగలడా? ఆయన తపశ్శాలే, కూర్చోగలడు కాదనం, కానీ హీరో మాస్ క్యారెక్టర్ కి, వశిష్ఠుడికి పోలిక చెప్పడం ఏమిటి? అనే అర్థం వచ్చేలా రాశారు.

రెండో వాక్యం ఏమిటంటే తిమిర నేత్రం…అంటే చీకటి నేత్రం లేదా గుడ్డికన్ను అంటారు. తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడై అని రాశారు. అది శివదూషణ అవుతుంది కదా… ఈ పాట రాసిన రచయితకి ఏ సంప్రదాయం తెలుసు? ఏ పురాణ కథలు చదివాడు? అలా సాగిపోయింది ఆ లేఖా సారాంశం.

అందుకు బదులుగా చంద్రబోస్ ….

ఒక ప్రైవేటు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతా వివరంగా చెప్పి కన్విన్స్ చేశాడు. అదీ సమర్థవంతంగానే చేయగలిగాడు. కానీ అప్పటికే తాటాకు నిప్పు అంటుకుంది. అదెంతవరకు వెళుతుందనేది తెలీదు. అయితే రచయితలు పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు చంద్రబోసు వైపు మాట్లాడుతున్నారు. అయితే దీనంతటికీ మూలం ఒకటి ఉంది. అదెవరూ గమనించడం లేదనేది సత్యం.

పుష్ప సినిమాలో ‘‘ఊ అంటావా మామా…ఊఊ అంటావా మామా’’ పాటపై

చంద్రబోస్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పుడా పాట కిక్కుతో సినిమా హిట్ అయి అదొక రేంజ్ కి వెళ్లిపోయింది. కానీ పాటపై విమర్శలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ తాజా గొడవ చూస్తుంటే స్పీడెక్కిపోయిన చంద్రబోస్ ని కొంచెం కంట్రోల్ చేయడానికే ఈ బ్రేక్ లు అని కొందరు నర్మగర్భంగా వ్యాక్యానిస్తున్నారు.

ఇటీవల యండమూరి వీరేంద్రనాథ్ కొత్త సినిమా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయనకి తెలిసినంతగా మార్కెటింగ్ స్ట్రాటజీ మరొకరికి తెలీదు. ఇప్పుడు జనానికి కాంట్రవర్శీయే కావాలి, అదే ఆయన పట్టుకున్నాడని మరికొందరు అంటున్నారు.

ఏది ఏమైనా మళ్లీ చంద్రబోస్ పాట…

‘‘ఊ అంటావా మామ..ఉ..ఉ..అంటావా’’ తరహాలో వాల్తేరు వీరయ్య పాట ఊపితే సినిమాకి తిరుగులేదని సందట్లో సడేమియాలా మరికొందరు వ్యాక్యానిస్తున్నారు.

Latest Articles

కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలింపు ?

      ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లను తిహార్ జైలులో జుడీషియల్ రిమాండ్ విధించడంతో మీడియాలో తీహార్ జైలు ప్రముఖంగా విన్పిస్తోంది. ఢిల్లీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్