34.2 C
Hyderabad
Monday, May 29, 2023

తెలుగింటి సత్యభామ…జమున మరిలేరు

‘‘మీర జాలగలడా…నా యానతి… వ్రత విధాన మహిమన్ సత్యాపతి…

నటన సూత్రధారి మురారి…ఎటుల దాటగలడో నా యానతి…’’

తెలుగు భాష తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ పాట సుపరిచితమే…అది శ్రీకృష్ణుడు- సత్యభామల మధ్య వచ్చిన మధుర ఘటన కాబట్టే అంత ప్రాచుర్యం పొందింది. తెలుగు సినిమా అభిమానులకే కాదు, ప్రజలకి కూడా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ గుర్తుకువస్తారు. అయితే శ్రీకృష్ణుడి పక్కన అష్ట భార్యలు ఉంటే వారిలో సత్యభామది ఒక ప్రత్యేకత…ఆ పాత్రకి ఔచిత్యం, ఆహార్యం పలికించడమే కాదు, అక్కడ దిగ్గజ ఎన్టీఆర్ కి దీటుగా నిలిచి పోటీ పడి నటించిన తీరు…నభూతో నభవిష్యత్తుగా మారింది. అందుకే ఎన్టీఆర్ ని కృష్ణుడు అన్న తెలుగు సినీ ప్రేక్షకలోకం…జమున కి సత్యభామ పట్టం కట్టి గౌరవించింది.

‘వినాయక చవితి’ సినిమాలో సత్యభామగా జమున  నటన చూసి జనం నీరాజనం పట్టారు. దాంతో ఆ పాత్రకి ఆ బ్రాండ్ అంబాసిడార్ గా జమున నిలిచిపోయింది. ఇక ఎన్టీఆర్ తో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం సినిమా…జమున కెరీర్ లో మేలి మకుటంగా మారింది. ఇక అప్పటి నుంచి సత్యభామ అంటే జమునే అన్నంతగా జనం ఫిక్స్ అయిపోయారు. తర్వాత కాలంలో ఆ స్థాయిలో మరెవరూ పోషించలేకపోయారంటే అతిశయోక్తి కాదు.

‘మూగ మనసులు’…ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా…అప్పటివరకు గత జన్మల స్ఫూర్తితో వచ్చిన సినిమాలు లేవు. అలా తెలుగు సినిమాకు ఒక గొప్ప కథా వస్తువుగా మారిపోయింది. ఆ సినిమాలో పాటలు, మాటలు, సావిత్రి, అక్కినేని నటన ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంత చెప్పినా ఆ సినిమాలో ఒక పాత్ర మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అదే జమున నటించిన  ‘గౌరి’ పాత్ర. సినిమా కథకి ఇరుసులాంటి పాత్ర అద్భుతంగా నటించి అందరితో శభాష్ అనిపించుకుంది.

‘గౌరమ్మా…నీ మొగుడెవరమ్మా’ పాటే కాదు…మాట కూడా పాపులర్ అయిపోయింది. కొత్తగా పెళ్లయ్యే ఆడపిల్లలను ఆట పట్టించే మాటగా ఆరోజుల్లో పాపులర్ అని చెప్పాలి.

‘‘గోదారి గట్టుంది…గట్టు మీద పిట్టుంది’’ పాట ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ గా నిలిచింది. పల్లెటూరి పాత్రలు, హుషారైన ఆడపిల్లల పాత్రలు చేయాలంటే తను ఒక మార్గదర్శకం చేసి చూపించింది. అప్పటి నుంచి జమున నటననే స్ఫూర్తిగా తీసుకుని పలువురు కొత్త నటీనటులు నటించడం విశేషం.

ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుని మకుటుం లేని మహారాణిగా నిలిచింది. ఒక దశలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో వచ్చిన విభేదాల కారణంగా మూడేళ్లు వారితో నటించలేదు.

ఆ సమయంలో తను తీసుకున్న ఒక నిర్ణయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ షాక్ తిన్నాది. అప్పటికే అగ్ర నాయికగా కొనసాగుతున్న సమయంలో జగ్గయ్యతో నటించి శభాష్ అనిపించుకుంది.  పురుషాధిక్య సమాజం, అలాగే హీరోల డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలో హీరోయిన్ జమున తీసుకున్న నిర్ణయం సాహసమనే చెప్పాలి. అలా వ్యవస్థని ఎదిరించి తనేమిటో నిరూపించుకుంది.

తర్వాత ఇండస్ట్రీలో గొడవలు సద్దుమణిగాయి. మళ్లీ అగ్ర హీరోల సరసన తను నటించడం మొదలుపెట్టింది.

కాలం మారుతున్న క్రమంలో…తనే నాలుగు మెట్లు దిగి, కుర్ర హీరోలు హరనాథ్, కృష్ణ తదితరులతో నటించడానికి ముందుకు వచ్చింది. జమున హీరోయిన్ అనగానే ముఖ్యంగా హరనాథ్ సినిమాలకు ఒక క్రేజ్ వచ్చింది. అలా తనేం చేసిన ఒక గట్స్ ఉన్న నటిగానే తెలుగు ఇండస్ట్రీలో పేరు నిలబెట్టుకుంది.

ఇక పండంటి కాపురం సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జమున…ఆ సినిమాలో చేసిన ‘‘రాణి మాలినీ దేవి’’ పాత్ర కూడా తెలుగు సినిమాల చరిత్రలో ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పాలి. అక్కడ నుంచి ఆ పాత్రని అంత పవర్ ఫుల్ గా పోషించేందుకు ప్రతి హీరోయిన్ ప్రయత్నించేవారంటే అతిశయోక్తి కాదు. ఈరోజున బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర ఎంతటి పవర్ ఫుల్ గా నిలిచిందో, దానికి స్ఫూర్తి ఆనాటి జమున పాత్రే అని చెప్పాలి. అలా ఇండస్ట్రీలో ఒక రోల్ మోడల్ గా నిలిచింది.

ఇక కలెక్టర్ జానకిగా ఆమె నటన నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. ఇలా ఒకటి కాదు…ఆమె కథానాయిక అనే కాదు. ఆట పాటలు, డ్యూయెట్స్ కే పరిమితం కాలేదు. నటనకు భాష్యం చెప్పిన నటి…ఆమె నటన ఒక సిలబస్…అని చెప్పాలి.

Latest Articles

కర్ణాటకలో మంత్రులకు శాఖలు కేటాయించిన ప్రభుత్వం

స్వతంత్ర, వెబ్ డెస్క్: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. మంత్రిత్వ శాఖల కేటాయింపులపై నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఎం సిద్ధరామయ్య ఆర్థిక శాఖతో పాటు కేబినెట్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్