29.2 C
Hyderabad
Monday, May 29, 2023

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ద్వార వైభవం

ముక్తి ని కోరుకునే భక్తులందరూ ఉత్తర ద్వార దర్శనం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. జీవిత కాలంలో ఒక్కసారైనా కలియుగ వేంకటథామమైన తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించాలని కలలు కంటూ ఉంటారు. అలాంటి అరుదైన అవకాశం వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున భక్తులందరూ ఎంత కష్టమైనా సరే, వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామిని దర్శించి పునీతులు కావాలని ఆశిస్తుంటారు.

ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశి రోజున తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు ఉదయం నుంచి కిక్కిరిసిపోయాయి. ఏ ఊరిలో చూసినా, ఏ చిన్న దేవాలయంలో చూసినా తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. అలా తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఉత్తర ద్వార దర్శనానికి ముస్తాబైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహుని ఆలయం

కలియుగ వైకుంఠమైన శ్రీ తిరుమల తిరుపతి క్షేత్రంలో భక్త కోటి పోటెత్తింది. ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తిరుమల క్షేత్రమంతా ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. క్యూలైన్లలో భక్తులు ఎంతో ఓపికగా ఆ స్వామి దర్శనం కోసం కుటుంబాలతో కలిసి ఎదురుచూస్తున్నారు.

తిరుమలతో పాటు యాదాద్రి, అన్నవరం, భద్రాచలం, విజయవాడ, ద్వారకా తిరుమల, మంగళగిరి, అనంతపురం, ధర్మపురి, అంతర్వేది, అప్పనపల్లి, సింహాచలం ఇలా ప్రముఖ దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఆలయాలు కూడా వైకుంఠ వైభవంతో వెలిగిపోతున్నాయి. తిరుమల క్షేత్రమంతా పూలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. వైష్ణవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా కనిపిస్తున్నాయి.

తిరుమలలో ముందుగా ప్రముఖులకే పెద్ద పీట వేశారు. ఆ తర్వాతే సామాన్యులకు ఆ దేవదేవుని చూసే భాగ్యం కల్పించారు. అందుకే ఘంటశాల గాత్రం నుంచి ఆనాడే అంటే 1966 సమయంలోనే ‘రంగుల రాట్నం’ చిత్రంలో ఒక పాట జాలువారింది.

 ‘‘కలవారినే గానీ కరుణించ లేడా

స్వామి, నిరుపేద మొరలేవీ వినిపించు కోడా’’

అంటే సమస్య ఈనాటిది కాదు…ఏనాటి నుంచో ఆచారంగా ఉండేది, నేడు సంప్రదాయంగా మారిపోయిందనే చెప్పాలి. విషయం ఏమిటంటే…

ముందుగా తిరుమల క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనం కోసం అత్యంత ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాటుచేశారు. అనంతరం ఉదయం 5 గంటల నుంచి 6 వరకు శ్రీవాణి ద్వారా టికెట్లు పొందిన భక్తులను అనుమతించారు. తదుపరి 6 గంటల నుంచి సామాన్య భక్తులను అనుమతికి మార్గం సుగమం చేశారు.

తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, మేరుగ నాగార్జున తెలంగాణ మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్,గంగుల కమాలకర్, శ్రీనివాస గౌడ్ తదితర ప్రముఖులు శ్రీవారి దర్శనం చేసుకున్నవారిలో ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, సింహాచలం, అన్నవరం క్షేత్రాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

Latest Articles

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12

స్వతంత్ర వెబ్ డెస్క్: సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 వాహకనౌక నింగిలోకి దూసుకుపోయింది. నిన్న ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ.. 27 గంటల 30 నిమిషాల పాటు కొనసాగిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్