27.7 C
Hyderabad
Monday, May 29, 2023

వేలానికి ‘ట్విటర్‌ పిట్ట’..! ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం

  • ట్విటర్‌ సంస్థకు చెందిన ఆస్తుల్ని 24 గంటల పాటు వేలం
  • ట్విటర్‌ ఆఫీస్‌లో నిరుపయోగంగా ఉన్న కిచెన్‌వేర్..
  • వైట్‌బోర్డ్‌లు, డెస్క్‌లు, ఇతర వస్తువుల అమ్మకం
  • వస్తువుల ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌ ప్రారంభ ధర 25డాలర్లుగా నిర్ణయం

ట్విటర్‌ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్నో సంచలనాలు, వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌. సగానికిపైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపడం, బ్లూటిక్‌ ఛార్జీల వసూలు నిర్ణయాలతో మస్క్‌ అందరి నోళ్లలో నానుతూ వచ్చారు. తాజాగా ట్విటర్‌ నుంచి వచ్చిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇంట్రస్టింగా మారింది. మస్క్‌ ట్విటర్‌ ఆస్తుల్ని మరోసారి అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించే హెరిటేజ్‌ గ్లోబల్‌ పార్టనర్‌ సంస్థ భాగస్వామ్యంతో.. ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ సంస్థకు చెందిన ఆస్తుల్ని 24 గంటల పాటు వేలం నిర్వహించేందుకు పెట్టారు. 24 గంటల తర్వాత వాటిని తొలగించనున్నారు. ట్విటర్‌ ఆఫీస్‌లో నిరుపయోగంగా ఉన్న కిచెన్‌వేర్, వైట్‌బోర్డ్‌లు, డెస్క్‌ల వంటి సాధారణ కార్యాలయ ఫర్నిచర్ నుండి 100 కంటే ఎక్కువ కేఎన్‌ 95 మాస్క్‌లు, డిజైనర్ కుర్చీలు, కాఫీ మెషీన్‌లు, ఐమాక్‌, ఛార్జింగ్‌ పెట్టేందుకు వినియోగించే స్టేషనరీలు ఉన్నాయి. వీటితో పాటు ట్విటర్‌ పిట్ట స‍్టాచ్యూ, @ సింబల్‌ వంటి కంపెనీ మెమోరీస్‌ నిండిన ఇతర వస్తువులు సైతం ఉన్నాయి. ఆ వస్తువుల ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌ ప్రారంభ ధర 25డాలర్లుగా ఉంది.

Latest Articles

అగ్రరాజ్యంలో కాల్పులు.. ముగ్గురు మృతి

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. న్యూమెక్సికో సిటీ బైక్‌ ర్యాలీలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్