40.2 C
Hyderabad
Thursday, April 25, 2024
spot_img

తెలంగాణాలో ముందస్తు ముచ్చట్లు

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? అసెంబ్లీ రద్దు చేసేందుకు కేసీయార్ నిర్ణయించారా? కాంగ్రెస్ బీజేపీల వాదనలు వింటుంటే, అది నిజమేనేమో అనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో  ముందస్తు ముచ్చటే లేదని అంటున్నారు.

ప్రత్యేకించి కేంద్ర మంత్రులను చూస్తే తెలంగాణాలో ముందస్తు తప్పదని ఘంటాపథంగా నొక్కి వక్కానిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రకటన వెలువడింది. అదే నిజమైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు కానున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ నేతలు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు  పిలుపునిస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కాంగ్రెస్, బీజేపీలు  చెప్పింది నిజం కావాలంటే, బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అది జరిగే పని  కాదంటున్నారు రాజకీయ పండితులు. ఒక వేళ  రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీని రద్దు చేస్తే  మే నెలలో జరగనున్న కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణాకు ఎన్నికలు జరగవచ్చునని చెబుతున్నారు. ఇవన్నీ కట్టుకథలుగా  వై.ఎస్. షర్మిల అభిప్రాయ పడుతున్నారు.

ఒకవేళ ఎన్నికలే వస్తే, లాభపడేది మేమంటే మేం అని కాంగ్రెస్, బీజేపీలు రెండూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాకపోతే ప్రతిపక్షాలు ఊహించినట్టు జరగదని అంటున్నారు.  ముందస్తుకు వెళ్తే మాత్రం కేసీఆర్ కే ప్లస్ అంటున్నారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాకిస్తూ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్ల పాలన తర్వాత  ప్రజల మూడ్ ని అంచనా వేసుకున్న కేసీఆర్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ  అసెంబ్లీని రద్దు చేశారు. అలా ముందస్తు ఎన్నికలు వచ్చాయి. అప్పటికే కేసీయార్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం చేసిన విపక్షాలు  ఆ ఎన్నికల్లో కేసీయార్ పార్టీ ఓటమి ఖాయమని లెక్కలు వేశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడాలని టీడీపీ-కాంగ్రెస్-కమ్యూనిస్టు పార్టీలు జట్టు కట్టాయి. కేసీయార్ మాత్రం ధైర్యంగా ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు.  కానీ ఎన్నికల ఫలితాలు వెలువడే సరికి ఆయన అనుకున్నది, తాను నమ్మిందే నిజమైంది. అలా 2014 ఎన్నికలను మించి తిరుగులేని ఆధిక్యంతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు.

2018 తరహాలో  కేసీయార్ మరోసారి ముందస్తుకు వెళ్తారన్నది విపక్షాల ప్రచారమే తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఎలాగైనా కేసీఆర్ ను ఓడించి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ బీజేపీలు పోరాడుతున్నాయి. ఇందులో మర్మం ఏమిటంటే, ఈ రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును  చీల్చలేకపోతే, కేసీయార్ మరోసారి సునాయస విజయం సాధించి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

కేసీయార్ మాత్రం తనకే సాధ్యమైన కూల్ హెడ్ తో తాను చేయదలచుకున్నది చేసుకుపోతున్నారు. దేశ వ్యాప్తంగా బి.ఆర్.ఎస్. వ్యాప్తికి నడుం బిగించిన కేసీఆర్  తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల తర్వాత దానికి వేగం పెంచుతారని అంటున్నారు.

రైతు బంధు పథకాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు మరి కొన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ప్రకటించిన తర్వాతనే కేసీయార్ ఎన్నికల మోడ్ లోకి వెళ్తారని వారంటున్నారు. ఈ క్రమంలో ముందస్తుకు మాత్రం ఆస్కారం లేదనేది మెజారిటీ నేతల భావన.

Latest Articles

బీజేపీ, కాంగ్రెస్‌కు ఈసీ నోటీసులు

లోక్‌సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్‌ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్