28 C
Hyderabad
Tuesday, April 16, 2024
spot_img

Taraka Ratna తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రముఖులు

Taraka Ratna funeral to be held today: చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించిన తారకరత్న పార్థీవదేహాన్ని హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్ కు తీసుకువచ్చారు. ఉదయం నుంచి అభిమానులు, తెలుగు దేశం కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ వచ్చి నివాళులర్పిస్తున్నారు.  మంచి మనసున్న తారకరత్నకు ఇలా జరగడంపై అందరూ షాక్ కి గురవుతున్నారు.

అన్నయ్య, బాబాయ్, మామయ్య, తమ్ముడూ ఇలాగే అందరినీ పిలుస్తూ ఉంటాడని, ఎవరినీ పేరు పెట్టి పిలవడని, అతనితో జ్నాపకాలు పంచుకుని సినీ ప్రముఖులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. షూటింగ్ సమయంలో సీనియర్లు వస్తే తనే ముందు లేచి వారిని ఆహ్వానించేవాడని, వాళ్లకి కుర్చీ చూపించి, అప్పుడు తను కూర్చుంటాడని, అంత గౌరవం ఇస్తాడని కొనియాడుతున్నారు.

ఫిలింనగర్ లో తారకరత్న(Taraka Ratna) పార్థీవదేహాన్ని చూసేందుకు అభిమానులు తరలివస్తున్నారు. అలాగే అతనితో చదువుకున్న ఒకనాటి హీరో తరుణ్ వచ్చి చిన్ననాటి జ్నాపకాలను పంచుకున్నారు. మేం ఇద్దరం కలిసి స్కూల్ కి వెళ్లేవాళ్లమని తెలిపాడు. ఇద్దరం ఎంతో మంచి ఫ్రెండ్స్ అని, క్రికెట్ అంటే ఇద్దరికి చాలా ఇష్టమని అన్నాడు. చిన్ననాటి జ్నాపకాలను గుర్తు చేసుకున్నాడు.

 

క్రికెట్ ఆడుదాం పదండీ అని తనని బలవంతం పెట్టి తీసుకువెళ్లేవాడని వెంకటేష్ చెప్పాడు. ఇలా అందరికీ తలలో నాలుకగా ఉన్న తారకరత్న తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ఫిలింనగర్ అంతా విషాదంతో నిండిపోయింది.

నందమూరి కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ దంపతులు వచ్చి అక్కడే ఉన్నారు. తారకరత్న కుటుంబ బాధ్యతను తనే తీసుకుంటానని వైసీపీ నేత విజయసాయిరెడ్డికి బాలకృష్ణ హామీ ఇచ్చారు.

తారకరత్న కుమార్తె తండ్రి పార్థీవ దేహం వద్దే ఉండి కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడ అందరినీ కంటతడి పెట్టించింది. ఆ చిన్నారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఎంతో ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి అస్వస్థతకు గురైంది.

కొత్తగా నాలుగు సినిమాల్లో నటిస్తూ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడమే కాదు, అటు రాజకీయాల్లో కూడా తన మార్క్ మాటలతో దూసుకెళుతున్న తారకరత్న అర్థాంతరంగా తనువు చాలించడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిలింనగర్ నుంచి ఇదేరోజు సాయంత్రం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు చేయనున్నారు.

 

Latest Articles

వరంగల్ గడ్డపై దళిత నేతల మధ్య ఎలక్షన్ వార్

     వరంగల్‌ జిల్లాలో ఎలక్షన్‌ వార్‌ తగ్గాఫర్‌గా సాగుతోంది. ఓరుగల్లు రాజకీయాలు నువ్వా నేనా అన్న రేంజ్‌లో విమర్శలు, ప్రతివిమర్శలతో సమ్మర్‌ను మించి కాకపుట్టిస్తున్నాయి. ఒకగూటి పక్షులే ప్రత్యర్థులు గా మారడంతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్