Sachin, BCCI felicitate ICC World Cup winning India U-19 women’s team : సౌత్ ఆఫ్రికా వేదికగా ఐసీసీ నిర్వహించిన అండర్ -19 టీమిండియా మహిళా జట్టు విజేతగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. వారు సౌతాఫ్రికా నుంచి సరాసరి ముంబయి వచ్చారు. అక్కడ నుంచి డైరక్టుగా అహ్మదాబాద్ కు తీసుకువచ్చారు. ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ 20 మూడో మ్యాచ్ ప్రారంభానికి ముందు మహిళా జట్టు స్టేడియం అంతా తిరిగింది. భారత అభిమానుల హర్షధ్వానాల మధ్య వారు కేరింతలు కొడుతూ తిరిగారు.

అనంతరం లెజండరీ క్రికెటర్, భారతరత్న, క్రికెట్ దేవుడు అయిన సచిన్ టెండుల్కర్ చేతుల మీదుగా మహిళా జట్టుకు సత్కారం జరిగింది. బీసీసీఐ ప్రకటించిన రూ.5 కోట్ల చెక్కును సచిన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ షెఫాలీ బృందానికి అందించాడు.
అనంతరం సచిన్ మాట్లాడుతూ ఆరోజున 1983లో కపిల్ దేవ్ తెచ్చిన మొదటి వరల్డ్ కప్ సంఘటన, భారతీయులు ఉప్పొంగిన క్షణాలు నాకు తెలుసు. ఆ స్ఫూర్తి నుంచి నేను క్రికెట్ నేర్చుకుని ఇంతవాడినయ్యాను. అలాగే ఈనాడు మహిళలు తీసుకువచ్చిన మొట్టమొదటి ప్రపంచకప్ ను చూసి ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి మహిళా క్రికెట్ ఉన్నతికి తోడ్పడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ఆశిష్, కార్యదర్శి జైషా తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అనంతరం అమ్మాయిలు మ్యాచ్ ను తిలకించారు.