32.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

సత్యనారాయణ సినీ ప్రయాణంలో ఎన్నో మలుపులు

1935 జులై 25న కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం జరిగింది. కైకాలకు భార్య నాగేశ్వరమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 60 ఏళ్ల నట ప్రస్థానంలో 700కి పైగానే సినిమాల్లో నటించారు. నవరస నటనా సార్వభౌమునిగా కీర్తి గడించారు.

అందరిలాగే సినిమా ఇండస్ట్రీలో తను కూడా కష్టాలు పడ్డారు. ఇక ఇంటికి వెళ్లిపోదామని అనుకునేలోపు…అప్పుడే జానపద చిత్రాల జోరు నడుస్తోంది. అందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ సినిమాలే ఎక్కువ. వాటిలో ఎన్టీఆర్ డూప్ గా పనికివస్తాడని సత్యనారాయణతో చేయించేవారు. ఆ ఒడ్డుపొడవు అచ్చు అలాగే ఉండటంతో సినిమా నిర్మాణంలో ఈజీ అయ్యేది. అలా ఇండస్ట్రీలో అడుగులు పెట్టి మొదట్లో భయంకరమైన విలన్ గా తెలుగు సినిమాలో తనకంటూ ఒక స్థాయి సృష్టించుకున్నాడు.

ఒకదశలో విలన్ గా సత్యనారాయణ లేని తెలుగు సినిమాని ఊహించలేం. అప్పటి టాప్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వీరందరి సినిమాలో కామన్ గా సత్యనారాయణ ఒక్కరే విలన్. అలా ఒక దశాబ్ధం పాటు విలన్ గా తెలుగు సినిమాని ఏలారు సత్యనారాయణ.

అయితే అతని నటనలో మరో కోణాన్ని చూసింది…మాత్రం కె.విశ్వనాథ్. తొలిసారి శారద సినిమాలో హీరోయిన్ అన్నయ్యగా ఒక సౌమ్యుని పాత్రలో నటించారు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ గోల పెట్టినా విశ్వనాథ్ ఎవరి మాటా వినకుండా సత్యనారాయణతో ఆ పాత్ర చేయించారు. అందులో శారదతో పాటు సత్యనారాయణ శోకాన్ని పండించిన తీరుతో ప్రేక్షకులు కంటనీరు పెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు.

అప్పటి నుంచి సత్యనారాయణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది. క్యారెక్టర్ రోల్స్ కి వెళ్లారు. సాఫ్ట్ పాత్రలతో పాటు విలన్ పాత్రలు కూడా చేస్తూ రెంటినీ బ్యాలన్స్ చేస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చూసుకున్నారు.

ఈ క్రమంలో దేవుడు చేసిన మనుషులు సినిమాలో ప్రముఖ నటులందరూ నటిస్తున్నారు. పాత్రలకు అందరూ సరిపోయారు. కృష్ణ, ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్…సినిమాపై విపరీతమైన ఎక్స్ పక్టేషన్స్…ఆ సినిమాలో సత్యనారాయణకు పాత్ర లేదు. దాంతో కృష్ణ వద్దకు వెళితే, ఒక పాత్రను సృష్టించారు. అది తాగుబోతు కొడుకు పాత్ర…మొదటి సారి అల్లూ రామలింగయ్యతో కలిసి కామెడీ చేశారు. ఇక అక్కడ నుంచి కామెడీని పండించడంలో కూడా నిష్ణాతుడైపోయాడు.

kaikala satyanarayana latest

‘కాలాంతకులు’ అని శోభన్ బాబు సినిమా వచ్చింది. ఇదీ కె.విశ్వనాథ్ దర్శకుడు. ఇందులో హీరో స్నేహితుడిగా సత్యనారాయణ నటించారు. కాకపోతే ఇద్దరు హీరోలు అన్నట్టు సినిమా సాగుతుంది. అలాంటి పాత్రను సమర్థవంతంగా పోషించి హీరో ఫ్రెండ్ గా కూడా నటిస్తూ మెప్పించాడు.

‘అగ్ని పర్వతం’ సినిమాలో పరుచూరి గోపాలకృష్ణతో కలిసి, సత్యనారాయణ చేసిన కామెడీ చూడచక్కగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఎన్నో ఎత్తుపల్లాలు ఆయన జీవితంలో అధిగమించారు. తరువాత కాలంలో చిరంజీవి స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో తన సన్నిహితునిగా మారారు. ఆ అభిమానంతోనే చిరంజీవి సత్యనారాయణ సొంత బ్యానర్ లో మూడు సినిమాలు చేయడం విశేషం.

ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరుపొందిన సత్యనారాయణ ఎన్నడూ వివాదాల్లోకి వెళ్లలేదు. అంత గొప్ప విలన్ గా నటించి కూడా ఏనాడు గాసిప్స్ ఆయనపై రాలేదు. అంత ఉన్నతంగా ఇండస్ట్రీలో 60 ఏళ్ల కెరీర్ ని నడిపించిన ఘనత ఒక్క సత్యానారాయణకే దక్కుతుంది.

చివరిగా చెప్పాలంటే తను హీరోగా ఒక సినిమాలో నటించాడు. అది కూడా రామానాయుడి సొంత బ్యానర్ లో అంటే ఆశ్చర్యం అనిపించక మానదు. అందులో హీరోయిన్ జయసుధ…సినిమా పేరు ‘మొరటోడు’ అయితే అంతకాలం విలన్ గా కనిపించిన సత్యనారాయణ సడన్ గా హీరో అనేసరికి జనం చూడలేకపోయారో లేదంటే, కథలో బలం లేక తను హీరోగా ఫెయిలయ్యాడో తెలీదుగానీ…మళ్లీ ఎవరూ సత్యనారాయణతో ఆ సాహసం చేయలేదు. కాకపోతే హీరోగా చేశానన్న తృప్తి ఆయనలో మాత్రం ఉంది. సునీల్ గవాస్కర్ చూడండి వన్డేల్లో ఆయనకు ఒక్క సెంచరీ కూడా లేదు. కానీ తను రిటైర్మెంట్ ప్రకటించిన ఆఖరి వన్డేలో సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. అలాగే సత్యనారాయణ కూడా 700పైనే చిత్రాల్లో చేసి హీరోగా కూడా సూపర్ అనిపించుకున్నారు.

గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉండి కూడా మహర్షి సినిమాలో నటించి ఔరా అనిపించారు. అదే సత్యనారాయణ నటించిన ఆఖరి సినిమాగా చెప్పాలి. తనకి ఓపిక ఉన్నంతవరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.  అశేషాభిమానులను శోక సంద్రంలో ముంచి ఒక తార వినీలాకాశానికి చేరింది.

Latest Articles

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

  ఇరాన్‌పై ఇజ్రాయెల్ తాజా దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్‌ - ఇరాన్ మధ్య గతంలో పరోక్ష యుద్ధాలు నడిచాయి. అయితే ఈ రెండు దేశాలు ముఖాముఖి తలపడటం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్