29.2 C
Hyderabad
Monday, May 29, 2023

శ్రీశైలానికి నేడు రానున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

భారీ బందోబస్తుతో పోలీసుల వలయంలో శ్రీశైలం

శ్రీశైల మహా క్షేత్రానికి నేడు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రానున్నారు ఈ నేపథ్యంలో శ్రీశైలం మహాక్షేత్రం అంత భారీ బందోబస్తు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని ఎస్పీ రఘువీరారెడ్డి కేంద్ర బలగాలు ఏర్పాటు చేశారు హెలికాప్టర్లో సుండిపెంట హెలిప్యాడ్ కు చేరుకొని రోడ్డు మార్గం ద్వారా కాన్వాయ్ లో శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకోనున్నారు అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రసాదం ప్రాజెక్టు స్కీం ద్వారా దేవస్థానం నిర్మించిన యాత్రికసదుపాయ భవనం, యాంపి థియేటర్ (ఓపెన్ ఆడిటోరియం) ప్రారంభం చేయనున్నారు తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపతి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు సుమారు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బాంబు స్క్వాడ్ అధికారులు కూడా అడుగడుగునా తనిఖీలు నిర్వహించి అడవులను రోడ్లు జల్లెడ పడుతున్నారు ఎక్కడ చూసిన పోలీసులతో శ్రీశైల క్షేత్రమంత పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు రాష్ట్రపతి పర్యటనకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పలుమార్లు ట్రయిల్ రన్ కూడా నిర్వహించారు అలాగే నేడు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏపీ చెక్ పోస్ట్ శిఖరం వద్ద తెలంగాణ చెక్ పోస్ట్ దోమలపెంట వద్ద మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు అలాగే భక్తులకు నేడు శ్రీ స్వామి అమ్మవారి దర్శనాలు అనుమతి నిలిపివేనున్నారు తిరిగి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన అనంతరం యధావిధిగా వాహనల రాకపోకలు, దర్శనాలు కొనసాగుతాయి……

Latest Articles

మణిపూర్‌లో మళ్ళీ చెలరేగిన తిరుగుబాటుదారులు..

స్వతంత్ర వెబ్ డెస్క్: మణిపుర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఒక్క రోజే 40 మంది తిరుగుబాటుదారులను హతమార్చినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఇంఫాల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్