35.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

మారుతీ సినిమా వరకు…ప్రభాస్ పాన్ ఇండియా ప్రయాణం

పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్ తీసుకునే నిర్ణయాలు చాలా విభిన్నంగా ఉంటాయి. అందుకేనేమో అంత త్వరగా ఆ స్థాయికి చేరుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి సినిమాకి ఐదేళ్లు కాల్షీట్లు ఇవ్వడం అంటే మాటలు కాదు…

అలాగే ఒకే ఒక్క చిన్న సినిమా ‘రన్ రాజా రన్’ లాంటిది తీసి హిట్ కొట్టిన సుజిత్ లాంటి కుర్ర దర్శకుడితో వంద కోట్ల సినిమా ‘సాహో’ లాంటిది చేయడం డేరింగ్ స్టెప్పు అనుకోవాలి.  ఆ తర్వాత కూడా అదే స్టెప్పు… ఒక్క సినిమా తీసి హిట్ కొట్టిన ‘జిల్’ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తో  కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ‘రాధే శ్యామ్’ తీయడం ఇవన్నీ తన కెరీర్ ని రిస్క్ లో పెట్టే నిర్ణయాలే అనుకోవాలి.

చివరిగా ‘ఆది పురుష్’ అంటూ హడావుడి చేసిన డైరక్టర్ ‘ఓం రౌత్’ కూడా ముందు ‘లోక్ మాన్య’, తానాజీ లాంటి సినిమాలు తీసినా బాక్సాఫీసు వద్ద పల్టీ కొట్టాయి. అలాంటి డైరక్టర్ తో రూ.500 కోట్ల బడ్జెట్ అంటూ హడావుడి చేసి ‘ఆది పురుష్’ ప్రకటించిన తర్వాత నిజంగానే గొప్ప సినిమా అనుకున్నారు. కానీ ట్రయిలర్ రాగానే అందరి గుండెలు పగిలిపోయాయి. అది త్రీడీ గ్రాఫిక్ మోషన్ పిక్చర్ గా తెలిసి హతాశుయులయ్యారు. ఇదేం సినిమారా బాబూ అనుకున్నారు.

2004లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తీసిన ‘కొచ్చాడయాన్’ తెలుగులో ‘విక్రమసింహా’ తరహాలో ఉండటంతో అభిమానులు తలలు పట్టుకున్నారు. ఆరోజుల్లో ఆ సినిమాకి రూ.120 కోట్లు ఖర్చయిందని అంటారు. ఆ దెబ్బకి మళ్లీ ఎవరూ ఆ ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు మళ్లీ ప్రభాస్-ఓం రౌత్ చేస్తున్నారు. వీళ్ల గుండె ధైర్యానికి మెచ్చుకోవాలని కొందరు అనుకుంటున్నారు. అవతార్ తరహాలో లాగేద్దామని భావించినట్టున్నారని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు.

ఇవన్నీ ప్రభాస్ తీసుకున్న వివాదస్పద నిర్ణయాలే… బాహుబలి ఇచ్చిన బ్రేక్ తో పికప్ తీసుకుందామని ప్రభాస్ చేసిన ప్రయత్నాలు ఇవన్నీ… కానీ పెద్దగా వర్కవుట్ అవుతున్నట్టుగా కనిపించడం లేదు.

తనకి వచ్చిన ఇమేజ్ ని త్వరత్వరగా క్యాష్ చేసుకుందామని అనుకున్నాడా? లేదంటే తన ఇమేజ్ పై ఓవర్ కాన్ఫిడెన్స్ తో  కొత్త వాళ్లకి  ఇచ్చాడా? తెలీదు.  కానీ ఒకే ఒక్క హోప్ ఉంది. అది ‘సలార్’ సినిమా. కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కావడంతో కేజీఎఫ్ లా ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా? అని ఎదురు చూస్తున్నారు. అదేమైనా నిలబడితే పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కి తిరుగులేదని అంటున్నారు.

ఈ క్రమంలో ప్రభాస్ సడన్ గా మారుతీ సినిమా చేయడం, తన మార్కెట్ ని తనే పై నుంచి కిందకు తీసుకురావడం విచిత్రమే అంటున్నారు.

వెంకటేష్ తో తప్ప మారుతి ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. అలాంటిది పాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రభాస్…ఈ సినిమా ఒప్పుకోవడం అది కూడా తెలుగులోనే చేయడం, ఆ తర్వాత డబ్ చేసి తర్వాత ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

అందుకే తన పాన్ ఇండియా ఇమేజ్ పోకుండా ఈ సినిమాలో ప్రభాస్ కి తాత గా నటించేందుకు సంజయ్ దత్ ని ఒప్పించినట్టు సమాచారం. అతను కూడా అతికష్టమ్మీద ఒప్పుకున్నాడని అంటున్నారు. సంజయ్ దత్ పాత్ర వెనుక, ప్రభాస్ తెలుగు సినిమా వెనుక ఇంత కథ దాగి ఉంది.

ఇకపోతే మారుతీ సినిమా హారర్ కామెడీ జోనర్ లో వస్తోందనే టాక్ వినిపిస్తోంది. బహుశా ప్రేమకథా చిత్రమ్ తరహాలో ఉంటుందని అనుకోవచ్చు. ఏది ఏమైనా ప్రభాస్…మళ్లీ తన కేరాఫ్ అడ్రస్ అయిన టాలీవుడ్ మార్కెట్ పై దృష్టి పెట్టడం, ఇక నేల విడిచి సాము చేయకూడదని భావించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Latest Articles

మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్