29.2 C
Hyderabad
Monday, May 29, 2023

సంక్రాంతి కానుక…వందే భారత్ రైలు

Sankranthi Gift: PM Modi Virtually Flag off VANDE BHARATH express On 15 january:

తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుక. వందే భారత్ రైలు మన జోన్ లో  సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య పరుగులు తీయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ 19న హైదరాబాద్ లో పర్యటించాల్సి ఉంది. అప్పుడే ప్రారంభోత్సవం ఉంటుందని అన్నారు. అయితే అనుకోని కారణాలతో పర్యటన వాయిదా పడింది. దీంతో అధికారులు సంక్రాంతి కానుకగా వందే భారత్ రైలు ప్రారంభోత్సవాన్ని ముందుకు తీసుకువచ్చారు.

జనవరి 15 సంక్రాంతి రోజున సికింద్రాబాద్ లో ఉదయం 10 గంటలకు వందే భారత్ రైలు ప్రారంభమవుతుంది. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా బటన్ నొక్కి ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైల్వేశాఖా మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ప్రపంచ దేశాల్లో బుల్లెట్ ట్రయిన్లు వచ్చాయి. భారతదేశం ఇంకా వెనుకపడింది. మనకెప్పుడు ఇలాంటి రైళ్లు వస్తాయని అనుకునేవారందరూ ఇక నుంచి ఆ డైలాగ్స్ కొట్టక్కర్లేదు. ఎందుకంటే బుల్లెట్ ట్రయిన్లు తరహాలోనే ఇవి కూడా ఉండటం విశేషం. వందే భారత్ రైలు గరిష్ఠ వేగం గంటకు 180 కిమీ. కానీ యావరేజ్ న గంటకు సుమారు 130 కిమీ వేగంతో నడుస్తున్నాయి. ఆన్ అండ్ యావరేజ్ 110 కిమీ వేగంతో వెళుతున్నట్టు సమాచారం.

ఉదాహరణకి కాకినాడ టు సికింద్రాబాద్ 500 కిమీ ఉంటే, దగ్గర దగ్గర 5గంటల్లో వెళ్లిపోతుంది. అదే ఇప్పుడైతే సుమారు 12 గంటల సమయం పడుతుంది. ఒక రాత్రి అంతా ప్రయాణించాల్సి వస్తుంది. ప్రయాణీకులకు ఇప్పుడా దిగులు లేదు. ఉదయం హైదరాబాద్ వెళ్లి సాయంత్రానికి పనులు చూసుకుని మళ్లీ వచ్చేయవచ్చు. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్ల మధ్య ఆగుతుందని అంటున్నారు.

టిక్కెట్టు ధరలు కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ రూ.1500 నుంచి 3000 పైనే ఉంటాయని అంటున్నారు.

ఇంత శుభ సమయంలో విశాఖలో వందే భారత్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు విసిరారు. నిర్వహణ, పర్యవేక్షణలో భాగంగా రైలు విశాఖపట్నం వెళ్లింది.  అనంతరం సాయంత్రం విశాఖ స్టేషన్ నుంచి కోచ్ కాంప్లెక్స్ కి వెళుతుండగా కొందరు ఆకతాయిలు రాళ్లు విసరడంతో ఒక అద్దం పగిలింది. దీంతో రైల్వే పోలీసులు ఆకతాయిల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇదే స్ఫూర్తితో బుల్లెట్ ట్రయిన్లు కూడా మన దేశంలోకి రానున్నాయి. అప్పుడే ట్రాక్ కూడా సిద్ధమవుతోంది. ముంబయి- అహ్మదాబాద్ మార్గంలో నూతన రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనికే రూ.1.60 లక్షల కోట్లు ఖర్చు అవుతోంది. భూసేకరణ అనంతరం ఇంకా ఎక్కువైనా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అప్పుడే ఎంత ఖర్చవుతుందనేది చెబుతామని అధికారులు చెబుతున్నారు. అది సక్సెస్ అయిన దానిని బట్టి…భారతదేశమంతా బుల్లెట్ ట్రయిన్లు వస్తాయని అంటున్నారు.

Latest Articles

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12

స్వతంత్ర వెబ్ డెస్క్: సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 వాహకనౌక నింగిలోకి దూసుకుపోయింది. నిన్న ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ.. 27 గంటల 30 నిమిషాల పాటు కొనసాగిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్