చిత్ర పరిశ్రమలోని తన సన్నిహితులకు.. ప్రతిఏటా మామిడి పండ్లు, పండుగలకు గిఫ్ట్స్ పంపడం పవన్ కళ్యాణ్ అలవాటు. త్రివిక్రమ్, అలీ, నితిన్, వేణు శ్రీరామ్ లాంటి వారికి పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నో బహుమతులు పంపారు. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా.. పవన్ కళ్యాణ్, లెజినోవా గిఫ్ట్స్ పంపడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వకీల్‌సాబ్ డైరెక్టర్‌కి పవన్, లెజినోవా మరోసారి క్రిస్టమస్ బహుమతులు, గుడ్డీస్ పంపినట్లు తెలుస్తోంది. అలాగే, సన్నిహితులందరికీ పవన్ దంపతులు క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలిపారు. వాటిపై పవన్ కళ్యాణ్, అన్నా అని రాసిఉంది.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది క్రిస్మస్‌కు తన అత్తగారింటికి (రష్యా) వెళ్లి క్రిస్టమస్ వేడుకలకి వెళతారు. కానీ ఈ ఏడాది పవన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడే జరుపుకొంటున్నట్లు తెలుస్తోంది. షూటింగ్స్‌తో బిజీగా ఉండడం, త్వరలో వారాహితో పొలిటికల్ యాత్ర ప్రారంభం కానుండడంతో పవన్ కళ్యాణ్ రష్యా టూర్ విరమించుకున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ వీటన్నింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.