29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

నీ గూడు చెదిరింది…నీ గుండె పగిలింది…

ఓ చిట్టి పావురమా…ఎవరు కొట్టారు?

ఈ పాట ఎప్పుడు విన్నా, ఎంత కఠినాత్ముడి మనసైనా ఇట్టే కరిగిపోతుంది. ఇప్పటికి జనం గుండెల్లో ఆ పాట గూడు కట్టుకుని ఉందంటే, పాట సాహిత్యం ఒక ఎత్తు అయితే, సంగీతం గొప్పతనం, పాడిన ఎస్పీ బాలు గాత్రం అన్నీ కలిసి ఆ పాటను శిఖరాగ్రాన కూర్చోబెట్టింది. ఇక ఆ సినిమా సృష్టించిన సంచలనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 35 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా పేరు…

నాయకుడు

దర్శకుడు మణిరత్నం హీరో కమల్ హాసన్ తో చేసిన సినిమా భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ లిఖించుకుంది. అప్పుడప్పుడే మణిరత్నం దర్శకుడిగా ప్రభ మొదలైంది. 1983లో పల్లవి అనుపల్లవి అని కన్నడంలో సినిమా తీస్తే నిరాశ పరిచింది. దాంతో తర్వాత మళయాళంలో మూడు సినిమాలు తీశారు. అవీ సరిగ్గా ఆడలేదు.

అప్పుడు తమిళంలోకి వచ్చి 1986లో మౌనరాగం తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వెంటనే 1987లో ‘నాయకుడు’ సినిమా కమల్ హాసన్ తో వచ్చి చరిత్ర సృష్టించింది. మళ్లీ మణిరత్నం వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్ని ప్లాఫ్ లు వచ్చినా తన క్రియేటివిటీకి ఏనాడూ మచ్చ రాలేదు. ఒక ట్రెండ్ సెట్టర్ గానే ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ ను పరిచయం చేసింది మణిరత్నమే .

తాజాగా ఆల్ ఇండియా డిమాండ్ ఉన్న దర్శక దిగ్గజ మణిరత్నం తర్వాత ప్రాజెక్ట్ కమల్ హాసన్ తో అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు స్టోరీ లైన్ ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో ఆసక్తి నెలకొంది. దీనిని బహు భాషా సినిమా గా రూపొందిస్తున్నారు. నాయకుడు స్ఫూర్తితో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం ఇద్దరు, ముగ్గురు టాప్ హీరోయిన్స్ బాగా ప్రయత్నాలు చేసుకొన్నారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది.

అయితే రెండేళ్లుగా పొనియన్ సెల్వన్ సినిమా లో మణిరత్నం మునిగిపోయారు. ఈ సినిమాలో నటిస్తున్న త్రిష చురుకుగా వ్యవహరించటం కలిసి వచ్చింది. రెండో పార్ట్ లో త్రిష కూడా ఐశ్వర్యా రాయ్ తో పోటీ పడి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో కమల్ హాసన్ తో సినిమా కోసం ఐశ్వర్యా రాయ్ పెద్ద గా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కానీ త్రిష ఈ అవకాశాన్ని స్వీకరించింది అని చెబుతున్నారు. దీంతో కమల్ హాసన్ సరసన త్రిష కు మణి సార్ ఓకే చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం మణిరత్నం మరియు త్రిష పూర్తిగా పొనియన్ సెల్వన్ రెండో పార్ట్ నిర్మాణంలో బిజీ అయిపోయారు. ఏప్రిల్ నెలాఖరులో ఈ సినిమా విడుదల అవుతుందని చెబుతున్నారు. అందుచేత మరో నెల పాటు ఈ సినిమా హడావుడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. జూన్, జూలై నెలల్లో కమల్ హాసన్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుందని చెబుతున్నారు.

మొత్తం మీద పొనియన్ సెల్వన్ సినిమా హిట్ కొట్టడంతో రెండో పార్ట్ కూడా అదే ఒరవడిలో ఉంటుంది అని అంటున్నారు. ఈ ఊపుతో కమల్ హాసన్ తో సినిమాను విజయపథంలోకి తీసుకెళ్లాలి అన్నది మణిరత్నం ప్లాన్ అని చెబుతున్నారు.

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్