- సోషల్ మీడియాలో కలకలం
- ఏపీ అంతటా పాల్ పర్యటనలు
మొన్నటి దాకా తెలంగాణలో కేసీయార్‌ను వెంటాడిన కేఏ పాల్ ఇప్పుడు ఆంధ్రప్రదేలోకి ఎంటర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ జోలికి పోకుండా వెరైటీగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మీద పడ్డారు. ప్రతీరోజూ చంద్రబాబుని విమర్శించటమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు. స్వయంగా ఏపీలో పర్యటిస్తూ హడావుడి చేస్తున్నారు.

కందుకూరు సభలో తొక్కిసలాట జరగగానే అక్కడ ప్రత్యక్షం అయ్యారు కేఏ పాల్. కందుకూరు ఘటనకు చంద్రబాబే కారణమంటూ తిట్లు మొదలు పెట్టారు.. అంతేకాదు, నేరుగా పోలీసుస్టేషన్ కు వెళ్లి మర్డర్ కేసు పెట్టాలంటూ హడావుడి చేశారు. ఈ లోగా గుంటూరు ఘటన జరగగానే అక్కడకు చేరుకొన్నారు. చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అక్కడ నుంచి అటే నేరుగా డీజీపీ ఆఫీసుకు వెళ్లారు. లోపలకు రానీయకపోవటంతో రోడ్ మీద తాండవం తొక్కేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఎదురొచ్చి స్వాగతం చెబుతారని, కానీ ఇక్కడే ఇలా ఉందని మండిపడ్డారు. ఇక కుప్పంలో చంద్రబాబుని పోలీసులు అడ్డుకోగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యారు. పోలీసులు చాలా మంచి పని చేశారంటూ కితాబు ఇచ్చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు మీద పోలీసు కేసు పెట్టాలంటూ డిమాండ్ కు పదును పెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ చాలా తీవ్రంగా తలపడుతుంటే..సడెన్ గా ప్రజాశాంతి పార్టీ ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగుదేశాన్ని విమర్శించటమే పనిగా రాజకీయ గలాటా మొదలు పెట్టేసింది. మొత్తమ్మీద ఈ గలాటా సోషల్ మీడియాలో పసందుగా మారింది. ప్రజాక్షేత్రంలో ఏ మేరకు ఉంటుందో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే.