32.2 C
Hyderabad
Sunday, June 11, 2023

బంగ్లాదేశ్‌ని బాదేశారు..!-మూడో వన్డేలో భారత్ ఘనవిజయం

  • 227 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి
  • ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీ

భారత బంగ్లాదేశ్ క్రికెట్ జట్లమధ్య జరిగిన మూడో వన్డేలో భారతజట్టు ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను ఏకంగా 227 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటికే బంగ్లాదేశ్ 2-0తో వన్డే సీరీస్ నెగ్గింది. భారతజట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 34 ఓవర్లకే 182 పరుగులకు ఆలౌట్ అయింది. భారతజట్టులో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ 113 పరుగులు చేయడంతో 409 పరుగులు చేయగలిగింది.

వన్డేలలో భారత్ 400 పైగా పరుగులు చేయడం ఇది నాలుగోసారి. ఇషన్ కిషన్ వన్డేలలో అత్యంత వేగంగా కేవలం 126 బంతుల్లో 23 బౌండ్రీలు, 9 సిక్సర్లతో డబుల్ సెంచరీ సాధించి .. వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్ గెయిల్ రికార్డును తిరగరాశాడు. క్రిస్ గెయిల్ గతంలో 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.

భారత్ తరపున గతంలో సచిన్ తెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ వన్డేలలో డబుల్ సెంచరీ చేశారు. రోహిత్ శర్మ మూడు సార్లు 200 పైగా పరుగులు చేశాడు. కాగా, వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన 7వ ఆటగాడిగా, అతి పిన్న వయస్సువాడిగా ఇషాన్‌ రికార్డు నెలకొల్పాడు.

Latest Articles

గ్రూప్ – 1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు

1.పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించి రావల్సి వుంటుంది. బూట్లు, బెల్ట్ ధరించి వచ్చే అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించబడదు. 2.ఉదయం 8.30 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతింబడుతుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్