- ప్రేమించిన వాడి మోసాన్ని తట్టుకోలేక బలవన్మరణం
బాలీవుడ్ లో యువనటి తునీషా శర్మ కు సంబంధించి కొత్త వివరాలు ప్రచారం అవుతున్నాయి. ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. అందుచేతనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం ప్రెగ్నెంట్ వార్తల్ని తోసిపుచ్చుతున్నారు. వైద్యుల రిపోర్టు లో కూడా ఇందుకు సంబంధించిన స్పష్టత వచ్చిందని చెబుతున్నారు.

మొదటగా తునీషా ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వార్తలు వచ్చాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు తర్వాత దీనిని ఆత్మహత్యగా ప్రకటించారు. లవ్ లో ఫెయిల్ అవ్వటంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని వెల్లడించారు. తునీషా తన సహనటుడు షీజాన్ మహమ్మద్ ఖాన్‌తో ప్రేమలో ఉంది. 15 రోజులు క్రిందట వీరిద్దరికి బ్రేకప్ అవ్వడంతో, అది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే కాగా ప్రియుడు షీజాన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకోని నాలుగు రోజులు జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.

హిందీ పరిశ్రమలో యువనటి ‘తునీషా శర్మ’ ఆత్మహత్య అందర్నీ షాక్‌కి గురి చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ, అతితక్కువ కాలంలోనే ఎంతో ఫేమ్ ని సంపాదించుకుంది. టీవీ సీరియల్స్ లో నటిస్తూనే సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో కూడా ఛాన్స్ లు అందుకుంది. సీరియల్ షూటింగ్ కి హాజరయ్యిన నటి.. అప్పటివరకు సెట్ లో సరదాగా అల్లరి చేసి, మరి కాసేపటిలోనే ఉరి తాడుకి వేలాడుతూ కనబడడంతో తోటి నటీనటులను కలిచివేసింది. సంఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో, హత్యకోణంలో కూడా దర్యాప్తు చేసిన పోలీసులు.. చివరికి ఆత్మహత్య అనే తేల్చారు.