- ఫార్ములా ఈ రేసింగ్ చూసేందుకు తరలివచ్చిన సినీ, క్రీడా సెలబ్రిటీలు
- నగరానికి చేరుకున్న సచిన్ టెండూల్కర్, ధావన్, దీపక్ చాహర్
- సందడి చేస్తున్న సినీ హీరోలు, నాగార్జున అక్కినేని, కొణిదెల రాంచరణ్, మహేశ్ బాబు కొడుకు గౌతమ్
హైదరాబాద్: భాగ్యనగరంలో ఫార్ములా ఈ రేసింగ్ సందడి కొనసాగుతోంది. రేసింగ్ చూసేందుకు సినీ, క్రీడా సెలబ్రిటీలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ధావన్, దీపక్ చాహర్, సినీ హీరోలు రామ్ చరణ్, మహేశ్ బాబు కొడుకు గౌతమ్ వచ్చారు.

అసలైన ఫైనల్ రేస్ 3 గంటలకు ప్రారంభమై నాలుగు గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది. ఫార్ములా ఈ రేసింగ్ లో మొత్తం 16 రేసింగ్ పోటీలు ఉండగా ఇప్పటివరకు 3 రౌండ్లు పూర్తి అయ్యాయి. ఈరోజు హైదరాబాద్ లో నాలుగో రేస్ జరుగనుండగా , జూలైలో ఇటలీలో జరిగే చివరి రేస్ తో ఫార్ములా ఈ రేసింగ్ చాంపియన్ షిప్ ముగుస్తుంది.

అయితే, ఈ రేసింగ్ నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. టికెట్ కొనుగోలు చేసినా వెహికిల్ పాస్ కావాలంటూ ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వద్ద ప్రేక్షకులను నిలిపివేశారు. టికెట్లు కొన్న రేసింగ్ అభిమానులు.. కార్లు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. టికెట్ల కొనుగోలు సమయంలో ఈవెంట్ నిర్వహకులు వెహికల్ పాస్ ఇవ్వలేదు. దీంతో టికెట్లు కొన్నవారికి పోలీసులతో పార్కింగ్ చిక్కులు వచ్చిపడ్డాయి.