29.2 C
Hyderabad
Monday, May 29, 2023

చైనా పర్యటన రద్దు: అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ నిర్ణయం

మొత్తానికి చైనా వాడు ఎక్కడా కుదురుగా ఉండేలా లేడు. ఇటు ఇండియా పక్కనే ఉండి, మాట్లాడితే సరిహద్దుల దగ్గర ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నాడు.  మరోవైపు అమెరికాని కూడా టార్గెట్ చేసినట్టు కనిపిస్తున్నాడు.  

కరోనాతో చైనా దేశమంతా విలవిల్లాడుతోంది. ఇంకోవైపు బీజింగ్ తోని అంతర్గత తిరుగుబాట్లతో అట్టుడికిపోతోంది. ఒక దిక్కున ప్రపంచమంతా ఆర్థికమాంద్యంతో అల్లాడుతోంది. మరో దిక్కున రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగడం లేదు.

ఇది ఎటు దారితీస్తుందో ఎవరికీ తెలియడం లేదు. ఇలా ప్రపంచం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే చైనావోడికి పనీ పాటా లేదా? ఏమనుకుంటున్నాడు వీడు? అని నెటిజన్లు తెగ తిట్టిపోస్తున్నారు.

ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, చుట్ట అంటించుకోడానికి నిప్పుందా? అని ఒకడు అడిగినట్టు…ప్రపంచమంతా ఇలా రగిలిపోతుంటే…చైనాకి సరదాగా ఉందా? అని అంతా సీరియస్ అవుతున్నారు.

చైనా పర్యటన వాయిదా వేసుకున్న అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్

 అక్కడా లేదు…ఇక్కడా లేదు…వెళ్లెళ్లి అమెరికా దేశం మీద నిఘా బెలూన్ ఎగరేసిందని అంతా అనుకుంటున్నారు. అయితే అంతా ఉత్తుత్తినే అది వాతావరణం వివరాలు తెలుసుకునేందుకు ఎగరేసిందే తప్ప, అందులో గూఢ చర్యం చేసేందుకేమీ లేదు అని చైనా నిజం చెప్పి లెంపలు వేసుకుంది.

ఇది మొదటి బెలూన్ కాదు…రెండోదని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే దాన్ని కూల్చివేయాలని మొదట భావించినప్పటికి…అందులో ఏమైనా రసాయనాల్లాంటివి ఉంటే, అవి దేశం మీద పడితే, ఇబ్బంది ఉంటుందని ఆలోచించి ఆగినట్లు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఆ బెలూన్ దిశను ఎప్పటికప్పుడు గమనించి అది అలెస్కా ప్రాంతం దాటిన తర్వాత పట్టుకుని, దాన్ని కూల్చివేయాలా? పేల్చి వేయాలా? లేదా పరిశీలించాలా? అనేది నిర్ణయిస్తామని పెంటగాన్ చెబుతోంది. అప్పుడు గానీ అసలు నిజాలు బయటకు రావని చెబుతున్నారు.

తాజాగా బెలూన్ అమెరికాలోని ‘మోంటోనా’ ప్రాంతంలో కనిపించింది. అది అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి అని చెబుతున్నారు.  ఇక్కడికి ఆ బెలూన్ రావల్సిన అవసరం ఏం వచ్చిందని అంటున్నారు. వెంటనే అమెరికన్ ఇంటిలిజెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు.

తమ రక్షణ విభాగానికి చెందిన అన్నింటి విషయంలో మరింత పకడ్బందీ చర్యల్లో పడ్డారు. అయితే ఈ బెలూన్ అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఎగరడం వల్ల అందులో వివరాలు పూర్తిస్థాయిలో తెలియడం లేదని అంటున్నారు. అందువల్లే రోజూ తిరిగే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడలేదని చెబుతున్నారు.

ఈ క్రమంలో అమెరికాపై నిఘా పెట్టాల్సిన అవసరం లేదని చైనా చెబుతోంది. మాకు ప్రత్యేక నిఘా శాటిలైట్ ఉంది కదా అంటోంది. ఒకవేళ ఆ శాటిలైట్లు కానీ   నిఘా వ్యవహారాలకి వినియోగిస్తే, దానిని అక్కడే పక్కదేశాలు కూల్చివేసే అవకాశం ఉంది. అందుకని ఇలా బెలూన్లు పంపిస్తున్నారని అంటున్నారు. దీనివల్ల పెద్ద ప్రమాదం ఉండదు, ఖర్చు కూడా తక్కువే కాబట్టి చైనా ఇలా చేస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

త్వరలోనే చైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ఇది వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.

Latest Articles

పవన్ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం

స్వతంత్ర వెబ్ డెస్క్: సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవన్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్