- బీఆర్ఎస్ యజ్ఞంలో ఏపీ కూడా భాగస్వామి కావాలన్న కేసీఆర్
- కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, పార్ఠసారథి తదితరులు

హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు కోసమే బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్ ఒక మహోన్నత యజ్ఞం మొదలు పెట్టిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్ ఎందుకు.. అనేదానిపై త్వరలో ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. దేశానికి ఒక సామూహిక లక్ష్యం ఉండాలని, దాని కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కులమతాల మధ్య కుంపట్లు పెట్టి గెలవడమే లక్ష్యం అయిందని తప్పుబట్టారు. ఇది అవసరమా? దేశంలో ఏ వర్గమైనా సంతోషంగా ఉందా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియామకమయ్యారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు ఏపీ నేతలు టీజే ప్రకాష్, రమేష్‌నాయుడు, గిద్దల శ్రీనివాస్, జేటీ రామారావులకు కండువా కప్పి పార్టీలోకి సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
