- దేశ విదేశాల నుంచి 2000 మందికి పైగా హాజరు
- గురువులను సత్కరించిన పూర్వ విద్యార్థులు
- పూర్వ విద్యార్థుల విరాళాలతో మౌలికవసతులు
గుంటూరు జిల్లా: తాడికొండలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ ఈరోజు స్కూల్ ఆవరణలో స్వర్ణోత్సవాలు జరుపుకుంది. 1972 నుంచి ఇప్పటిదాకా చదివిన పూర్వ విద్యార్థులు దాదాపు 2 వేలమంది హాజరై గత స్మృతులు నెమరు వేసుకోవటంతోబాటు అప్పటి గురువులను సత్కరించుకున్నారు. స్వర్ణోత్సవ చిహ్నాలుగా పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలకు మెరుగులుదిద్దారు.