38.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

అయ్యో! అని సింపతీ చూపిస్తే…బాధేస్తుంది: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఇష్టపడని చిరంజీవి…ఇప్పుడు మైక్ దగ్గరకి వెళితే చాలు, దానిని వదలడం లేదు. అల్లూ రామలింగయ్య అవార్డు ఫంక్షన్ లో కూడా ఎంతో ఓపెన్ గా పర్సనల్ విషయాలు చెప్పి నవ్వించారు. అలాగే ఎప్పుడూ ఎవరిపైనా సీరియస్ అవని చిరంజీవి…కొత్త సినిమా ‘‘వాల్తేరు వీరయ్య  మీట్ ది ప్రెస్’’ లో సీరియస్ అయ్యారు. పనిలో పనిగా క్లాస్ పీకారు, అలాగే నటీ నటులకి చిరు సందేశం ఇచ్చారు.

ఒక విలేకరి అడిగిన ప్రశ్న ఏమిటంటే…‘‘మీకింత స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో నటించాల్సిన అవసరం ఉందా? అంటే చిరంజీవి ఒక్కసారి ఎమోషనల్ అయ్యారు.

‘‘అవును కష్టపడాలి…అలా కష్టపడని రోజున బెటర్ టు రిటైర్డ్ ’’

అని చాలా ఖరాకండీగా నటీనటులు అందరికీ ముఖం మీదే చెప్పారు. మరి ఎందుకలా అన్నారో తెలీదు. లేదంటే ఇండస్ట్రీలో నటీనటులు నేడు సౌకర్యాలపై పెడుతున్న దృష్టి, నటనపై లేదని ఫీల్ అవుతున్నారో తెలీదు. మొత్తానికి చిరు మాటలు ఇండస్ట్రీకి సూటిగానే గుచ్చుకున్నాయి.

‘‘నీవు ఆ కష్టం చేయగలిగితేనే ఇండస్ట్రీలో ఉండు లేదంటే, గెట్ లాస్ట్’’

అన్నమాట… ఇండస్ట్రీ మొత్తానికి ఛెళ్లు మని చెంప మీద కొట్టినట్టుగా ఉందని పలువురు భావిస్తున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ…

‘‘ ఈ మాట ఇండస్ట్రీ మొత్తానికి చెబుతున్నాను. ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత…ఎంతటి కష్టమైనా పడాల్సిందే, ఎన్ని ఇబ్బందులైనా ఫేస్ చేయాల్సిందే. అలా చేయలేమని అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో ఉండొద్దు. వేరే పని వెతుక్కోండి ’’ అని నిష్కర్షగా చెప్పారు.

‘‘మనం పడే కష్టాన్ని బయట ఎవరికీ చెప్పుకోకూడదు. బయటపడకూడదు. ఈ స్టార్ డమ్ ఊరికినే వస్తుందా? స్టార్ కావాలంటే కష్టపడాలి అని ఎవరైనా అంటారు. బాధ ఉంటుంది. నేనూ మనిషినే కదా…మైనస్ 8 డిగ్రీల టెంపరేచర్ లో పాటకు స్టెప్పులు వేయాలంటే మాటలు కాదు. ఒక పలచని షర్ట్ మాత్రమే వేసుకున్నాను. ఇంటికి వెళ్లాక నా పాట్లు నేను పడ్డాను. కాళ్లు, చేతులు మొత్తం ఐస్ అయిపోయాయి. ఇంటికి వెళ్లి వేడినీళ్లతో స్నానం చేయడం, కాళ్లు కాపడం పెట్టుకోవడం ఇవన్నీ చేశాను. ఇవి నా బాధలు…ఎవరికి చెప్పాలి?

ఈ వయసులో అయ్యో ఆయన ఎంత కష్టపడుతున్నారని అంటే నిజంగా నాకు బాధ వేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే సిగ్గేస్తుంది. అని అన్నారు. సినిమా తెరపై…నా పెర్ ఫార్మెన్స్ చూసినప్పుడు, ప్రేక్షకులు, క్లాప్స్ కొట్టేటప్పుడు, కేరింతలు కొడుతున్నప్పుడు కలిగే ఆనందం ఉంది చూశారా… అది కోట్ల రూపాయల కన్నా ఎక్కువ’’ అని తెలిపారు.

అభిమానులు కొట్టే చప్పట్ల కోసం..ఇంకా కష్టపడతాను. ఆ అభిమానులను అలరించాలి. వారిని ఆనందింపచేయాలి. నిత్యం అదే తపనతో పనిచేస్తాను. అందుకే నాకు ఏ దశలోనూ కష్టం అనిపించదు. మరి నా బిగినింగ్ డేస్ లో హీరో కావాలని అనుకున్నప్పుడు ఎంత కష్టపడకపోతే ఈ స్థాయికి చేరి ఉంటాను. ఒకసారి మీరే ఆలోచించండి అని చెప్పారు. డ్యాన్స్ లు, ఫైట్లు ఒళ్లు పులిసిపోయేది…ఎన్ని వందల సినిమాలు చేసినా కష్టం అనే మాట నా డిక్షనరీలోనే ఉండదు, రాదు, అందరిలాగే చివరి వరకు నటిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. మొత్తానికి చిరంజీవి పీకిన క్లాస్ యావత్ ఇండస్ట్రీని ఒకసారి ఆలోచించేలా చేసిందనే టాక్ వినిపిస్తోంది.

మరి కొత్త జనరేషన్ తో కూడా వర్క్ చేస్తూ హుషారుగా పనిచేస్తున్న చిరంజీవి మాటలు ఇండస్ట్రీపై ఏ విధంగా పనిచేస్తాయి. ఇతర నటీనటులు ఏ విధంగా స్పందిస్తారనే దానిపై పలువురు ఆసక్తిగా చూస్తున్నారు.

Latest Articles

ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ‘చాయ్‌ పే చర్చ’

    డిజిటల్‌ రంగంలో భారత్‌ చాలా మార్పులు తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అయితే, కృత్రిమ మేధతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్