38.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

వల్లభనేని జనార్థన్ అంటే ‘గ్యాంగ్ లీడర్’ గుర్తొస్తుంది

విజయబాపినీడు అల్లుడు, నిర్మాత, నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్థన్ మృతి

కరడుగట్టిన పోలీసాఫీసర్ గా, విలన్ గా, గ్రూప్ విలన్లలో ఒకరిగా, తండ్రిగా, తాతగా ఇలా సుమారు 120 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు వేసిన వల్లభనేని జనార్థన్ మృతి చెందడంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అందులో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో సుమలత తండ్రిగా నటించి, హీరో చిరంజీవి కుటుంబంలో చిచ్చు పెట్టే నెగిటివ్ పాత్రను పోషించి అందరి మెప్పు పొందిన వల్లభనేని జనార్థన్ (63) అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

సీనియర్లు ఒకరి తర్వాత ఒకరు ఇలా మరణిస్తూ ఉండటంతో…టాలీవుడ్ తీవ్రశోకంలో మునిగిపోయింది. ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మూడో కుమార్తెను వివాహం చేసుకున్న జనార్థన్ మంచి నటుడిగా కూడా రాణించి సుమారు 120 చిత్రాల్లో నటించారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒకమ్మాయి శ్వేత చిన్నతనంలోనే మరణించింది. అభినయ ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు. కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలో ఉన్నారు.

ఏలూరు సమీపంలోని పోతులూరులో వల్లభనేని జనార్థన్  1959 సెప్టెంబరు 25న జన్మించారు. చిన్నతనం నుంచి నాటకాలపై విపరీతమైన ఆసక్తి కావడంతో కాలేజీలో చేరిన తర్వాత అది మరింత పెరిగి స్టేజిపై నాటకాలు వేసే వరకు వెళ్లారు. స్నేహితులు వాటిని చూసి అభినందించడంతో కళాశాల చదువు పూర్తికాగానే ‘కళామాధురి’ పేరుతో నాటక సంస్థను ప్రారంభించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.

ఈ క్రమంలోనే నాటకాల తర్వాత సినిమాల వైపు దృష్టి సారించారు. అలా కెరీర్ బిగినింగ్ లో సొంత బ్యానర్ స్థాపించి ‘మామ్మగారి మనవలు’ సినిమా మొదలు పెట్టారు. అది అనుకోకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ‘చంద్రమోహన్ హీరోగా ‘అమాయక చక్రవర్తి’  సినిమాకి దర్శకత్వం వహించారు. అప్పుడాయన వయసు 21 ఏళ్లు మాత్రమే. తర్వాత శోభన్ బాబు హీరోగా తోడు-నీడ సినిమా చేశారు. ఆ తర్వాత శ్వేతా ఇంటర్నేషనల్ అని ఒక సంస్థను ప్రారంభించి ‘‘శ్రీమతి కావాలి’’, ‘‘పారిపోయిన ఖైదీలు’’ సినిమాలు తీశారు.

‘శ్రీమతి కావాలి’ సినిమాలో అనుకోకుండా ఒక నటుడు రాకపోతే, ఆ పాత్రను తనే చేయాల్సి వచ్చింది. అలా నటుడై సినిమాల్లో బిజీగా మారిపోయారు. తర్వాత మామ విజయబాపినీడు దర్శకత్వంలో ‘మహాజనానికి మరదలు పిల్ల’ సినిమా తీశారు. అలాగే రవితేజను హీరోగా శ్రీనువైట్లను దర్శకుడిగా నిలబెట్టిన ‘నీకోసం’ సినిమాను తనే నిర్మించడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి-విజయబాపినీడుకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. అందుకే చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాల్లో జనార్థన్ నటించారు. అలాగే ఇతర హీరో సినిమాల్లో కూడా నటించి మంచి నటుడిగా నిరూపించుకున్నారు. వల్లభనేని జనార్థన్ మృతితో ఎప్పుడే వార్త వినాల్సి వస్తుందోనని టాలీవుడ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Latest Articles

బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం ముదురుతోందా?

    బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం ముదురుతోందా.. ఒక్కొక్కరుగా కారు దిగి చేతిని అందుకుంటున్నారా.. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత గులాబీ పార్టీ ఖాళీ అవుతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. లోక్‌సభ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్