26.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

ముక్కంటి సేవలో…తరిస్తున్న భక్త కోటి

Maha Sivaratri 2023: రెండు తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా ప్రజలందరూ శివాలయాలకు క్యూ కడుతున్నారు. తెల్లవారుజామునే లేచి పుణ్యస్నానాలు ఆచరించి ఆ మహాశివుడిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివెళ్లారు. ఇక ముందుగానే ప్రముఖ శైవక్షేత్రాలకు తరలివెళ్లిన భక్తజన కోటికి లెక్కేలేదు. శివరాత్రిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో పూలు, పండ్లు, విద్యుద్దీపాలతో అలంకరించారు.

శ్రీశైల క్షేత్రంలో…భక్తుల సందోహం

 

భ్రమరాంబికా మల్లిఖార్జునుడి సన్నిధికి కాలబాటన భక్తులు తరలివెళ్లి దర్శనం చేసుకున్నారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పాతాళ గంగ దగ్గర కృష్ణానది భక్తుల స్నానాలతో రద్దీగా మారింది. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు నంది వాహన సేవ ఉంటుంది. అనంతరం జగద్గురు పీఠాధిపతి మహాశివునికి అభిషేకం నిర్వహిస్తారు. ఇక రాత్రి మహాన్యాసక రుద్రాభిషేకం, మల్లిఖార్జున స్వామి ఆలయానికి పాగాలంకరణ ఉంటుంది. అనంతరం రాత్రి భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి కల్యాణం జరుగుతుంది.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో…

ఉదయం ఇంద్ర విమానం, చప్పరం వాహనాలపై మాడవీధుల్లో ఆది దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో రాహుకేతు పూజలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. రద్దీని తట్టుకోవడానికి తెల్లవారుజామున రెండుగంటల నుంచే భక్తులను అనుమతిచ్చారు. అంతేకాదు వీఐపీల కోసం ప్రత్యేక క్యూ లైన్లను సిద్ధం చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బందుల్లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. అయినా సరే కాసేపు తోపులాట, తొక్కిసలాట జరిగింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది స్పందించడంతో క్యూ లైన్లు ప్రశాంతంగా ముందుకి కదిలాయి.

వేములవాడ రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్త జనం

 

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు హోరెత్తిపోతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతర కనుల పండువగా సాగుతుంది. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడలో మూడు రోజులు శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. జాతర సందర్భంగా పట్టణం శోభాయమానంగా మారింది.

కోటప్పకొండ తిరునాళ్లు

ల్నాడు జిల్లాలో కొలువైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి అంటే భక్తులకు ఎంతో నమ్మకం. మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వర స్వామికి బిందె తీర్థంతో ఆలయ అర్చకులు తొలిపూజ నిర్వహించారు. అప్పటి నుంచి భక్తులను అనుమతిస్తూనే ఆదివారం రాత్రి వరకు మధ్యమధ్యలో ప్రత్యేకాభిషేకాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కోటప్పకొండకు రావడానికి నరసరావు పేట డిపో నుంచి  265 బస్సులను ఏర్పాటుచేశారు. ఇవి శివరాత్రి 24 గంటలు తిరుగుతాయని డిపో అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇక్కడ శివరాత్రి పూజలు జరగడం విశేషం. తిరునాళ్ల మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరునాళ్ల వేడుకల కోసం ఆలయాన్ని పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ లాంఛనాలతో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ప్రసాదాల కోసం అరిసెలు, వడలను భారీ ఎత్తున తయారుచేశారు.

ఇక ఉభయగోదావరి జిల్లాల్లోని పంచారామాలు, శైవ క్షేత్రాల్లో…

హర హర మహాదేవా, శంభో శంకర అంటూ శివనామస్మరణతో  ఆలయాలు హోరెత్తిపోయాయి. పక్కనే పుణ్య గోదావరి నదిలో స్నానాలాచరించి భక్తులు దేవాలయాలకు తరలివెళుతున్నారు. అన్ని దేవాలయాల్లో శివరాత్రి సందర్భంగా అర్థరాత్రి వరకు పూజలు, అభిషేకాలతో భక్తులకు కనువిందు చేస్తున్నారు.

 

శివరాత్రి జాగరణ చేసేందుకు ఉత్సాహంగా భక్తులు…

జాగరణ ఎలా చేయాలని భక్తులు ప్లాన్లు వేసుకుంటున్నారు. కొందరు రాత్రిళ్లు సినిమాలకు వెళ్లాలని అడ్వాన్స్ టికెట్లు తీసుకుంటున్నారు. కొందరు దేవాలయాలకు వెళ్లి కాలక్షేపం చేయాలని భావిస్తున్నారు. ఇలా అయితే పుణ్యం పురుషార్థం కూడా దొరుకుతుందని అనుకుంటున్నారు. కొందరు ఇళ్లల్లోనే టీవీ కార్యక్రమాలు చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఎవరికి సాధ్యమైన రీతిలో వారు శివరాత్రి జాగారణ చేసేందుకు నడుం బిగిస్తున్నారు.

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్