Site icon Swatantra Tv

టమాట ఢమాల్‌..! -ధర పతనంతో కర్నూలు రైతుల కంట కన్నీళ్లు

టమాటా ధర పతనం కర్నూలు జిల్లా రైతుల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆరుగాలం శ్రమిస్తున్నా. రైతుకు చివరికి కన్నీరే దిక్కవుతోంది. ఏం చేయాలో తెలియక రైతులు.. తాము పండించిన చేతులతోనే పంటను నేలపాలు చేస్తున్నారు. రోడ్డు మీద పారబోస్తున్నారు. పశువులకు మేతగా వేస్తున్నారు.

మార్కెట్‌లో టమోటా ధరలు కుప్పకూలిపోయాయి. కిలో టమోటా.. ఒక రూపాయి పలుకుతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్‌లో రైతులు టమాటా పంటను అమ్మబోతే తక్కువ ధర పలుకుతోంది. వినియోదారులు కొనేటప్పుడు మాత్రం రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు పండిన పంటకు గిట్టుబాటు ధర రాక మరోవైపు అమ్మకానికి వచ్చిన పంటను నిల్వ చేయలేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటా ధర భారీగా పతనమైంది. గత 10 రోజులుగా ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటాకు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో రూపాయి పలకడంతో టమోటా రైతులు రవాణా ఖర్చు కూడా రావడం లేదని వాపోతున్నారు. కొందరు తెచ్చిన టమోటా బాక్స్ లను మార్కెట్ లోనే వదిలి వెళ్లిపోతుండగా.. కొందరు రోడ్డుపైనే పారబోస్తున్నారు. ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని టమోటా రైతులు కోరుతున్నారు.

Exit mobile version