Site icon Swatantra Tv

కౌంటింగ్ రోజునా కట్టుదిట్టమైన పోలీసు భద్రత

   పోలింగ్‌ డే రచ్చతో ఏపీ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఓటింగ్‌కే రాష్ట్రం రణరంగంగా మారితే, ఇక కౌంటింగ్‌ నాడు పరిస్థితి ఏంటా అన్న టెన్షన్‌ పట్టుకుంది ఖాకీలకు. దీంతో ఎక్కడికక్కడ చర్యలకు పూనుకున్న పోలీసులు. కార్డన్‌సెర్చ్‌ ఆపరేషన్‌తో రంగంలోకి దిగారు. మరోవైపు అల్లర్ల ఘటనపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది ఈసీ. దీంతో మాచర్ల ఈవీఎంల వ్యవహారం, పార్టీ నేతల ఫిర్యాదులు, ఎమ్మెల్యే పిన్నెల్లి ఎపిసోడ్‌తో ఏపీ రాజకీయం రంజుగా సాగుతోంది.

   ఏపీలో పోలింగ్‌ వేళ జరిగిన రచ్చ ఇప్పటికీ రాజుకుంటోంది. ఓ వైపు ఓటింగ్‌ జరుగుతుండగానే అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో కక్షపూరిత రాజకీయాలు తెరపైకి వచ్చాయి. వైసీపీ, టీడీపీల మధ్య దాడులు జరగడంతో రాష్ట్రం రణరంగంగా మారింది. యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. జూన్‌ 4 కౌంటింగ్‌ డే కావడంతో మరింత అప్రమత్తమయ్యారు. పోలింగ్‌కే అంత రచ్చ జరిగితే కౌంటింగ్‌ నాడు ఇంకా ఎలాంటి పరిస్థితు లు నెలకొంటాయోనన్న టెన్షన్‌ పట్టు కుంది. దీంతో కార్డన్‌సెర్చ్‌ ఆపరేషన్‌తో రంగంలోకి దిగారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలను ముమ్మరం చేశారు. బాణసంచా, లూజ్‌ పెట్రోల్‌ విక్రయాలపై నిషేధం విధించారు. కౌంటింగ్‌ రోజున విజయోత్సవాలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని ఇప్పటికే అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు.

    కౌంటింగ్ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచింది పోలీస్‌ యంత్రాంగం. పోలింగ్ తర్వాత గొడవలతో రణరంగంలా మారిన చంద్రగిరి, పల్నాడు, తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తతకు దారి తీసే పరిస్థితు లతో మరింత ఫోకస్‌ పెట్టింది. కేవలం ఈ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కార్డన్‌సెర్చ్‌ ద్వారా తనిఖీలు చేపట్టింది.అనుమానితులను, గుర్తింపు కార్డులు లేని వాళ్లను, అదుపులోకి తీసుకుని విచారి స్తోంది. రిజిస్ట్రేషన్ లేని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసింది. ఇక కౌంటింగ్‌ రోజు శాంతి భద్రత లకు విఘాతం కలగకుండా 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేయనుంది పోలీస్‌ యంత్రాంగం. పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అల్లర్ల లో పాల్గొనే వారి వాహనాలు సైతం సీజ్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అల్లర్లను ప్రోత్సహించేలా కేడర్‌ను ఉసిగొలి పితే కఠిన చర్యలు తప్పవని అభ్యర్థులకు పోలీసులు నోటీసులు కూడా ఇస్తున్నారు. మరోవైపు కౌంటింగ్‌ తర్వాత కూడా ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండటంతో ఓట్ల లెక్కింపు రోజే కాదు. ఆ తర్వాత కూడా 15 రోజులపాటు పోలీస్‌ భద్రత కొనసాగుతుందని చెబుతున్నారు పోలీస్‌ అధికారులు.

Exit mobile version