Site icon Swatantra Tv

దేశంలో ఇవే చివరి ఎన్నికలు – మమతా బెనర్జీ

    మమతా బెనర్జీ బీజేపీని టార్గెట్ చేస్తూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలు చెబుతూనే ఉన్నారని ఆరోపించారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే, మైనారిటీలు, గిరిజ నులు ఇతర వెనుకబడిన తరగతులు అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బిజెపి, సిఎఎ, ఎన్‌ఆర్‌సిని ఉపయోగిస్తుంది.తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మిథాలీబాగ్‌కు మద్దతుగా ఆరంబాగ్‌లో జరిగిన సభలో బీజేపీ ఓట్లను కొనుగోలు చేస్తోందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. ఓటుకు 5,000, 10,000, 15,000 ఇస్తున్నారని, ఈ నాటి బిజెపి నాయకులు సీపీఐ(ఎం)కు చెందిన పాతకాలపు సంఘవిద్రోహులని అన్నారు. భీభత్స పాలన కొనసాగకూడదను కుంటే బీజేపీకి ఓటు వేయొద్దని, ప్రలోభాలకు లోనవద్దని ప్రజలను ఉద్దేశించి చెప్పారు.

  ఢిల్లీలో అధికార సమీకరణాలను మార్చేందుకే ఈ ఎన్నికలు అని మమతా బెనర్జీ అన్నారు. ఢిల్లీలో ఈ పవర్ ఈక్వేషన్‌ ను మార్చి మార్పు తీసుకురావాలి. బెంగాల్ ప్రజలను పరువు తీయడం బీజేపీకి బాగా అలవాటయిందని మండిప డ్డారు. పశ్చిమ బెంగాల్‌లో 26,000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలను భాజపా లాక్కుందన్నారు మమతా బెనర్జీ. తప్పుడు సందేశాలతో సందేశ్‌ఖాలీ మహిళలను అవమానిం చారని ఆమె అన్నారు. అయితే నిజం బయటపడిందని, బీజేపీ నేతల ఆటలలు కొనసాగవని స్పష్టం చేశారు.

  మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోనే కాదు దేశం అంధకారంలోకి వెళుతుందని అన్నారు. మైనారిటీలు, గిరిజనులు ఇతర వెనుకబడిన తరగతులు అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బిజెపి సిఎఎ, ఎన్‌ఆర్‌సిని ఉపయోగిస్తుంది. వంద రోజుల పని కల్పనలో మా పార్టీ డబ్బులు దోచుకుందని మోడీ అంటున్నారు. వంద రోజుల పని కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.24 కోట్లు ఆదా చేసిందని, ఈసారి మోడీ గెలిస్తే అన్నీ పోతాయని, భవిష్యత్తులో ఎన్నికలే ఉండవని ప్రజలను హెచ్చరించారు దీదీ.

Exit mobile version