Site icon Swatantra Tv

బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదే..!

CM KCR

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కి సంబంధించిన మ్యానిఫెస్టోను ప్రకటించారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా ప్రజలందరికీ రూ.5లక్షల కేసీఆర్ బీమా. కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్ ఏర్పాటు చేయనున్నారు. సాామాజిక పెన్షన్లు రూ.5వేలకు పెంపు. తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణి, మైనార్టీ బడ్జెట్ పెంపు, మైనార్టీ సంక్షేమం.. ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. దళితబంధును కొనసాగిస్తాం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని నిర్ణయం. మైనార్టీ జూనియర్ కళాశాలకు డిగ్రీ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయడం వంటివి మ్యానిఫెస్టోలో చేర్చారు సీఎం కేసీఆర్. ఇచ్చిన హామీలన్నింటిని 6 నెలల్లో అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. చనిపోయిన రైతులకు రైతుబీమా ద్వారా రూ.5లక్షలు అందజేశాం. వీటన్నింటిని యదావిధిగా కొనసాగుతున్నాయి. 1కోటి 10లక్షల కుటుంబాలు ఉంటాయి.. ఈ కుటుంబాలన్ని 93 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులున్నాయి. కేసీఆర్ బీమా పథకం వర్తిస్తుందని తెలిపారు. కేసీఆర్ బీమా ప్రతీ ఇంటికి బీమా పథకం ప్రజలకు చాలా మేలు చేస్తుంది.

Exit mobile version