Site icon Swatantra Tv

దాహంతో అల్లాడుతున్న ఏజెన్సీలు

ఎండలు మండుతున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇలాంటప్పుడు తాగడానికి నీరు కరువైతే?.. పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు ఇప్పుడు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటు న్నాయి.

   పాలకులు మారినా ఏజెన్సీ గ్రామాల్లోని సమస్యలు మాత్రం తీరడం లేదు. గిరిజనులకు కనీసం నోరు తడుపుకునేందు కు గుక్కెడు నీరు దొరకని దుస్థితిలో ఉన్నారు. వేసవికాలం వచ్చిందంటే చాలు నీటి కోసం తిప్పలు పడాల్సిందే. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మారుమూల గ్రామాలు దాహార్తితో అల్లాడుతు న్నాయి. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో ఉట్నూరు మండలం నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసి గూడాలు, ఇంద్రవెల్లి నార్నూర్, గాదిగూడ మండలాలకు నీటి కష్టాలు తప్పడం లేదు. సమీపం లోని వాగులు, వ్యవసాయ బావులే వీరికి నీటి వనరులుగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఏజెన్సీ గ్రామాల్లో పనిచేయడం లేదు. మిషన్ భగీరథ పైపులైన్లు వేసినా నీటిని సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. పైప్‌లైన్లు చెడిపోవడంతో గూడేలకు నీరు సరఫరా కావడం లేదని ఆదివాసీలు చెబుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కాలినడకన మూడు కిలోమీటర్లు దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నా మని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించినా తమ సమస్యలు మాత్రం తీరడం లేదని ఆదివాసీలు అంటున్నారు. ఇప్పటికైనా తమ గోడును పట్టించుకొని నీటి సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు.

Exit mobile version