Site icon Swatantra Tv

Vehicle Loan: వెహికల్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి..

Vehicle-loan

Vehicle Loan: వాహనం కొనుగోలు చేయడానికి ప్రస్తుతం చాలామంది లోన్స్ తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనం మొదలు మరే వాహనం తీసుకోవాలన్నా బ్యాంకులతో పాటు అనేక ఆర్థిక సంస్థలు లోన్స్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో వీటిపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ద్విచక్ర వాహనం ప్రస్తుతం నిత్యావసర వస్తువుగానూ మారింది. చాలా మంది టూ వీలర్‌ కలిగి ఉంటున్నారు. వాహనం కొనుగోలు చేసేటప్పుడు రుణం తీసుకుంటే తప్పకుండా ఈ విషయాలను గుర్తించుకోవాలి. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలకు భారత్ అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం భారత్‌లో 54 కుటుంబాలకు ఒకటి లేదా అంతకుమించిన ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. అలాగే, 2021 -22 ఆర్థిక సంవత్సరంలో 13.47 కోట్ల ద్విచక్ర వాహనాలు సేల్‌ అయ్యాయి. వీటిలో సుమారు 60శాతం మోటరు సైకిళ్లే ఉన్నాయి. ద్విచక్ర వాహనం తీసుకోవాలని ఆలోచన చేసే వారు ముందుగా ఆలోచించేది లోన్ గురించి. తన ఆదాయం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, ఎంత మేరకు లోన్ వస్తుంది.. ఏ స్థాయిలో నెలవారీ చెల్లింపులు ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందనేది పరిశీలిస్తారు.

ప్రస్తుతం దాదాపు అన్ని వెహికిల్ షో రూమ్‌లలో రుణ సంస్థల ప్రతినిధులు కూడా అందుబాటులో ఉంటున్నారు. లోన్ కు అవసరమన డాక్యుమెంట్లు, ఇతర విషయాలను వివరిస్తారు. అయితే ముందుగా వెహికల్‌ ఆన్ రోడ్ ధర తెలుసుకోవాలి. ఆ వాహనానికి లభించే లోన్ ఆఫర్ల గురించి ఎంక్వైరీ చేయాలి. కొన్ని రకాల వాహన మోడల్స్ కు కొన్ని బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీకి రుణాలు ఇస్తుంటాయి. వాహన తయారీ సంస్థ, బ్యాంక్ కు మధ్య ఒప్పందం మేరకు అలాంటి ఆఫర్లు వస్తుంటాయి. అలాంటి ఆఫర్ల గురించి తెలుసుకోవాలి.

సంక్రాంతి, దసరా దీపావళి వంటి పండుగల సందర్భాల్లో వాహనాల సేల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ సమయాల్లో మంచి డిస్కౌంట్ , క్యాష్ బ్యాక్ , సర్వీస్ ఫ్రీ, నో ప్రాసెసింగ్ ఫీ .. వంటి ఆఫర్లు వస్తుంటాయి. సమీప భవిష్యత్తులో అవి వచ్చేలా ఉంటే, టూ వీలర్ కొనుగోలును వాయిదా వేసుకోవడం మంచిది. ఆదాయం, ఆ ఆదాయానికి గానూ లభించే రుణ మొత్తం, రీపేమెంట్ కాలం, ఈఎంఐ మొదలైన విషయాలు తెలుసుకోవాలి. నెలవారీ చెల్లింపులకు ఇబ్బంది లేని కాల పరిమితిని ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా కాల పరిమితి పెరుగుతున్న కొద్దీ నెలవారీ చెల్లించే మొత్తం తగ్గుతుంటుంది. అందువల్ల, కాల పరిమితి మరీ ఎక్కవ లేకుండా, అలాగే, నెలవారీ చెల్లింపుల్లో ఇబ్బంది కలగకుండా టెన్యూర్ ను, లోన్ అమౌంట్ ను నిర్ణయించుకోవాలి. రుణం తీసుకుంటున్న సంస్థ గురించి కూడా తెలుసుకోవాలి. కొన్ని సంస్థలు ఈఎంఐల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అవసరమైతే, ఆన్ లైన్ లో ఆయా సంస్థల క్రెడిబులిటీ, చరిత్ర తెలుసుకోవాలి.

Exit mobile version