Site icon Swatantra Tv

కిరణ్‌ రాయల్‌తో ఆర్థిక లావాదేవీలకు ఆధారాలున్నాయి – లక్ష్మి

తిరుపతి జిల్లా జనసేన అధ్యక్షుడు కిరణ్‌ రాయల్‌తో కొంతకాలంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీలకు అన్ని ఆధారాలు ఉన్నాయని లక్ష్మి చెప్పారు. తనకు కిరణ్ రాయల్‌ ఇవ్వాల్సిన నగదు చెల్లించే వరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని సెటిల్‌ చేస్తామని తనకు సీఐ హామీ ఇచ్చారన్నారు. తన వెనక ఏ పార్టీ మద్దతు లేదన్నారామె. తాను విడుదల చేసిన వీడియోలు అన్నింటినీ ఏడాది క్రితమే జనసేన పార్టీ కిరణ్‌ రాయల్‌ తీసుకున్నారని చెప్పారు. తన ఆరోగ్యం బాలేదని, న్యాయ పోరాటం చేస్తున్న తనపై సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారని లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వచ్చి కలవాలని పవన్ కళ్యాణ్ పీఏ నుంచి తనకు ఫోన్‌లు వస్తున్నాయని ఆమె చెప్పారు.

Exit mobile version