Site icon Swatantra Tv

కవిత పిటిషన్‌పై రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిలు ఇవ్వాలని కోరుతూ..బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై కోర్టు రేపు విచారణ జరపనుంది. అవినీతి, మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఆమెను ఈడీ, సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా..జూలై 1న న్యాయస్థానం బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..సీబీఐ, ఈడీ స్పందనలు తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20న చేపడతామని ధర్మాసనం తెలిపింది.

Exit mobile version