Site icon Swatantra Tv

ఏపీలో రేపు జరిగే పోలింగ్ కు సిబ్బంది సిద్ధం

   రేపు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరగనుంది. అరకు, పాడేరు, రంప చోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ పూర్తి కానుంది. ఏపీలో 46 వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12 వేల 438 సమ స్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 34 వేల 651 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1 లక్షా 6 వేల 145 మంది సిబ్బంది పాల్గొంనున్నారు.

Exit mobile version