Site icon Swatantra Tv

సబ్ స్టేషన్‌లో షిప్ట్‌ ఆపరేటర్ మహిళతో రాసలీలు

     తన విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ విద్యుత్ సబ్ స్టేషన్‌లోనే షిఫ్ట్ ఆపరేటర్ ఒక మహిళతో రాసలీలలు కొనసాగిస్తూ గ్రామ స్తులకు చిక్కిన సంఘటన. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌లో అవుట్‌ సోర్సింగ్ పద్ధతిన మహేశ్వర్‌రెడ్డి షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తు న్నాడు. నిన్న తెల్లవారుజామున సబ్ స్టేషన్ పరిధి లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎంతసేపటికి కరెంటు రాకపోవడంతో కార్యాలయానికి ఫోన్ చేశారు. అయినా స్పందించ లేదు. దీంతో స్థానికులు కార్యాలయంలోకి వెళ్లి చూడగా షిఫ్ట్ ఆపరేటర్ ఒక మహిళతో నగ్నంగా నిద్రిస్తున్నట్లు గుర్తిం చారు. విద్యుత్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి చేరుకొని మహేశ్వర్‌రెడ్డి, మహిళను విచారించారు. మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేసిన డీఈ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు.

Exit mobile version