Site icon Swatantra Tv

నేడే టీడీపీ రెండో జాబితా విడుదల

     అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే తన అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ఇవాళ విడుదల చేయనుంది. సుమారు 25 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ 94 మందితో తన తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు 31 స్థానాలను కేటాయించిన టీడీపీ 144 సీట్లలో బరిలోకి దిగనుంది. తొలి జాబితా పోను ఇంకా 50 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

      మరోవైపు.. టీడీపీ టికెట్లను ఆశిస్తున్న పలువురు నేతలు అధినేత చంద్రబాబును కలిశారు. విశాఖ జిల్లా భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. మాజీ మంత్రి పొంగూరు నారాయణ చంద్రబాబును కలిశారు. గంటాను చీపురుపల్లిలో పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా చంద్రబాబును కలిసి.. కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు సమాచారం. కడప జిల్లా జమ్మలమడుగు ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి, బద్వేలు ఇన్‌చార్జి రితేశ్‌ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా పొద్దుపోయాక చంద్రబాబును కలిసి మాట్లాడారు. తమ సీట్లలో నెలకొన్న సమస్యల గురించి వారు చర్చించినట్లు సమాచారం. జమ్మలమడుగు, బద్వేలు పొత్తులో బీజేపీకి పోవడంతో దానిపై మాట్లాడేందుకు ఆ నియో జకవర్గాల నేతలు వచ్చారు.

Exit mobile version