Site icon Swatantra Tv

కీలక మలుపు తీసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు

    తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో కీలకంగా సూత్రధారి అయిన SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు హైదరాబాద్‌ రాబోతున్నారు. అమెరికా నుంచి ఇవాళ ఆయన హైదరాబాద్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలకంగా ఉన్న ప్రభాకర్‌ రావు చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. ప్రభాకర్‌రావును విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. SIB చీఫ్‌గా ఉండి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డ ప్రభాకర్‌ రావు . రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు విచారిస్తున్నారు. టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.

    మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం క్రమంగా ఎన్నికల డబ్బు పంపిణీ వైపు వెళ్తోంది. ఓ ప్రధాన పార్టీ తరపున పోలీసు వాహనంలో పెద్ద ఎత్తున నిధులు తరలించినట్టు నిందితులు అంగీకరించినట్టు తెలు స్తోంది. త్వరలోనే కొందరు రాజకీయ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉండవచ్చని తెలిసింది. ఇదే జరిగితే ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరింత సంచలనంగా మారబోతోంది.

     ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో భాగంగా హవాలా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రణీత్‌రావు ముఠా పలువురు వ్యాపారుల ఫోన్లు, హవాలా వ్యాపారుల ఫోన్లపై నిఘా పెట్టినట్టు గుర్తించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీల నాయకులు, సహచ రులు, మద్దతుదారులపై నిఘా పెట్టి, వారు తరలిస్తున్న డబ్బును పట్టుకున్నట్లుగా అనుమాని స్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు కూడా ఈ ఆరోపణలను మౌఖికంగా అంగీకరిం చినట్టు తెలుస్తోంది. ప్రణీత్‌ రావు.. ఫోన్లపై నిఘా ఉంచగా, వారిచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌ రావు క్షేత్రస్థాయిలో పంపిణీ అవుతున్న డబ్బును పట్టుకోవడం లో కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు. ఇదే సమయంలో ఒక ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థుల డబ్బు పంపిణీ లో మరొక అధికారి కీలకంగా వ్యవహరించినట్టు.. పోలీసుల వాహనాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా నిధులు రవాణా చేసినట్టు గుర్తించారు. విచారణ సందర్భంగా ఎవరెవరికి డబ్బు అందజేశామనే వివరాలు కూడా చెప్పి నట్టు తెలుస్తోంది. ఈ విషయాలు నిర్ధారించుకునేందుకు డబ్బు అందుకున్నారని భావిస్తున్న అందరికీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఇందులో మజీ మంత్రుల స్థాయి వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే నోటీసుల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది.

Exit mobile version