Site icon Swatantra Tv

రైతు కంట కన్నీరు మిగిల్చిన మిర్చి మార్కెట్

ఎర్ర బంగారం ఓవైపు కర్షకుల కంట కన్నీరు పెట్టిస్తోంటే, మరోవైపు దళారులకు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు అల్లాడు తుంటే,మరోవైపు అధికారుల, దళారులు కుమ్మక్కై అన్నదాతను కష్టాలపాలు చేస్తున్నారు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు మిర్చి రైతులు.

ఎర్ర బంగారంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్ కళకళలాడుతున్నా.. రైతుల కంట కన్నీరు ఆగడం లేదు. రోజు రోజుకు మార్కెట్‌లో మిర్చి ధరలు పడిపోవడంతో అన్నదాత ఆందోళన చెందు తున్నాడు. మరోవైపు నాణ్యత లేదని ధరను తగ్గించి దళారులు జేబులు నింపుకుంటుంటే, అధికా రులు, వ్యాపారుల తీరుతో రైతులు కన్నెర్ర చేస్తున్నారు. ఎనుమాముల మార్కెట్‌కు ఉమ్మడి వరం గల్ జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, చత్తీస్‌గఢ్‌ నుంచి రైతులు పెద్ద సంఖ్యలో మిర్చిని తీసుకొస్తారు. దీంతో మార్కెట్‌కు భారీగా మిర్చి రావడంతోనే వ్యాపారులు ధర నియంత్రిస్తున్నారని ఆరోపిస్తున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి, పంటకు తగిన ధర రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని వాపోతున్నారు. జెండా పాట పాడినా, ఆ ధర ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే దక్కుతోందని ఆవేదన చెందుతున్నారు. మిర్చికి నిజంగానే డిమాండ్‌ లేదా. ఇంకా ఏవైనా కారణాలున్నాయా అన్నదానిపై వ్యవసాయాధికారులు సమీక్షించి వాస్తవాలు తెలియజే యాలని కోరుతున్నారు.

    విపరీతమైన ఎండలతో ఉష్ణోగ్రత పెరగడం, భారీగా మిర్చి బస్తాలు రావడంతో మార్కెట్ యార్డు లోని కార్మికులు, దడువాయిలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట అమ్మేవరకూ అక్కడే ఉండాల్సి రావడంతో యార్డులో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడుతున్నారు మిర్చి రైతులు. అలాగే యార్డును శుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. ఇక్కడి అధికారులు, వ్యాపార స్తుల తీరుపై జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరిం చాలని కోరుతున్నారు.ఏది ఏమైనా రైతు కన్రెర్ర చేస్తే మానవ మనుగడే అసాధ్యం. కాబట్టి తక్షణమే రైతు సమస్యలపై ఉన్నతాధి కారులు స్పందించాలని,దళారుల ఆట కట్టించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అన్నదాత ఆవేదన విన్న జనం.

Exit mobile version