Site icon Swatantra Tv

వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం

ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందు అసంతృప్తిగా ఉన్న నేతలు ఇప్పడు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీ రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో..ఆయన కంటే ముందుగానే షాక్ ఇచ్చారు ఎమ్మెల్సీ పోతుల సునీత. తాజాగా ఆమె వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు MLC పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు పోతుల సునీత ప్రకటించారు. ప్రస్తుతం సునీత వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

మరోవైపు వైసీపీకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన.. రేపు పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పార్టీ మారేందుకు మంత్రి అనగానితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు మోపిదేవి వెంకటరమణ. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తున్న నేపథ్యంలో..వైసీపీ నేతలందరూ ఒక్కొక్కరుగా జారుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే ఆపార్టీ ఖాళీ అయిపోవచ్చన్న వాదన కూడా ఉంది.

Exit mobile version